Andhra Pradesh: ఈ మధ్యకాలంలో చిన్న చిన్న కారణాలకే చంపుకోవడాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇన్‌స్టాలో కామెంట్ పెట్టాడని.. తన ఫ్రెండ్‌ను ఫాలో అవుతున్నాడని.. పబ్లిక్‌లో పిలిచాడని.. ఇలాంటివి అన్ని అయిపోయాయి. తాజాగా తనను చూసి ఎగతాళిగా నవ్వాడని ఓ బాలుడిని పదునైనా కత్తితో నరికి చంపేశాడో వ్యక్తి.
పదునైనా కత్తితో బాలుడిని నరికి చంపిన వ్యక్తి..
భార్య తనను విడిచి వెళ్లిన అవమానంతో తీవ్ర ఆగ్రహంలో ఉన్న వ్యక్తిని చూసి అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు నవ్వాడు. అది చూసిన వ్యక్తి పదునైన కత్తితో బాలుడిని నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా రేణిగుంటలో కలకలం సృష్టించింది.
భార్య వదిలివెళ్లిందన్న ఒత్తిడితో హత్య చేశాడా..
తన భార్య తనను వదిలి వెళ్లిపోయిందని హేళనగా నవ్వాడని బాలుడిపై వ్యక్తి దాడి చేశాడు. అయితే విషయం తెలుసుకున్న బాలుడు శ్రీహరి తండ్రి నిందితుడి వద్దకు వెళ్లి తన కొడుకును ఎందుకు కొట్టావని నిలదీశాడు మరోసారి కొడితే ఊరుకోనని హెచ్చరించి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అయితే శ్రీహరి తండ్రి వెళ్లిపోయిన కాసేపటికే బాలుడికి నిందితుడికి మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన వ్యక్తి బాలుడి మెడపై పదునైనా కత్తితో నరికేశాడు. తీవ్రంగా గాయపడ్డి బాలుడిని తిరుపతి రుయా హాస్పిటల్‌కు తరలించారు.
Also Read: బ్రిలియంట్ కాలేజీ చోరీ కేసులో వెలుగులోకి సంచలనాలు..
హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన శ్రీహరి..
అయితే తీవ్రంగా గాయపడ్డ బాలుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భార్య వదిలి వెళ్లిందన్న ఒత్తిడిలో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తనను చూసి నవ్వాడని నరికి చంపేశాడు..
తిరుపతిలోని గువ్వల కాలనీలో దారుణ ఘటన
పదునైన కత్తితో శ్రీహరిని నరికి చంపిన నిందితుడు
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన శ్రీహరి
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు pic.twitter.com/dLkBuEx54M
— BIG TV Breaking News (@bigtvtelugu) October 11, 2025