Mithra Mandali Movie: సినిమా రిలీజ్ సిద్ధమైందంటే.. షూటింగ్ మొత్తం పూర్తయినట్టే. రిలీజ్ డేట్‌కి నెల రోజుల ముందే షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టేస్తారు. అయితే ఇక్కడ ఓ సినిమా రిలీజ్6 రోజులే ఉన్నా.. ఇంకా షూటింగ్ జరుపుకుంటుంది. పోనీ అది పెద్ద సినిమానా అంటే అదీ కాదు. మూవీకి కూడా పెద్దగా బజ్ కనిపించడం లేదు. కానీ, రిలీజ్కి ఇంకా ఆరు రోజులే ఉన్నా..ఇంకా ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం అందరిని షాకిస్తోంది.అసలు ఈ చిత్రం విడుదలవుతుందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి.
ఇంతకి ఆ సినిమా ఏంటంటే ‘మిత్రమండలి‘. కమెడియన్ ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం జంటగా విజయేందర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మ్యాడ్ ఫేం విష్ణు, రాగ్ మయూర్లు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు వర్క్స్, అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంపై పెద్దగా బజ్ కనిపించడం. నిజానికి కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ విడుదలైన ఈ మూవీపై ఎలాంటి టాక్ వినిపించడం లేదు.
ఇండస్ట్రీలో టాప్ కమెడియన్స్ అంత ఈ సినిమా లో ఉన్నారు. కానీ, ఆ క్రేజే ఈ సినిమాకు లేదు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అసలు ఈ సినిమానేది ఒకటి ఉందా అని కొంతమంది ఆడియన్స్ తెలుసా? లేదా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల విడుదలైన ట్రైలర్ ఫుల్ కామెడీతో సాగింది. కానీ, కథేంటనేది ఎవరికి అర్థం కాలేదు. మొదటి నుంచి చివరి వరకు కమెడీనే ప్రధానంగా సాగింది. కానీ, కథపై మాత్రం క్లారిటీ లేదు. ట్రైలర్తో మూవీపై మంచి బజ్ క్రియేట్ అవుతుందనుకుంటే ఉన్న హైప్ కూడా పోయింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ కానుంది.
Also Read: Manchu Lakshmi: బాడీ షేమింగ్ కామెంట్స్.. మంచు లక్ష్మికి సీనియర్ జర్నలిస్ట్ క్షమాపణలు
అంటే మిత్రమండలి రిలీజ్కి ఇంకా 6 రోజులే సమయం మాత్రమే ఉంది. కానీ, ఇంకా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుందట. మెయిన్ పార్ట్ అంత అయిపోయింది. కొన్ని సీన్స్కి సంబంధించిన ప్యాచ్ వర్క్ షూట్ జరుగుతుందట. ఇది తెలిసి మూవీకి ఉన్న కాస్తా బజ్ కూడా పోయింది. ఆరు రోజుల్లో రిలీజ్ డేట్ పెట్టుకుని ఇంకా షూటింగ్ జరగడమేంటని ఇండస్ట్రీవర్గాలు ముక్కున వేలుసుకుంటున్నాయట. ఇక ట్రైలర్ చూసి అసలు మూవీ కథేంటనేది ఆడియన్స్ అభిప్రాయం. ఆఖరికి ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రియదర్శి పాత్రపై ఏంటనేది కూడా క్లారిటీ లేదు. దీంతో అసలు ఈ సనిమా ఎందుకు తీశారో మూవీ టీంకి అయినా తెలుసా? అంటూ సినీ క్రిటిక్స్ ట్రోల్ చేస్తున్నారు. మరీ ఎలాంటి బజ్, హైప్ లేని ఈ సినిమా అక్టోబర్ 16 తర్వాత ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.