Teja Sajja -Karthik :తేజ సజ్జ.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అని చెప్పడంలో సందేహం లేదు.. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకోవడమే కాకుండా రూ.100 కోట్లకు క్లబ్లో చేరిపోయి అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోలు కూడా రూ.100 కోట్ల క్లబ్ కోసం ఎదురు చూస్తుంటే.. ఇండస్ట్రీలోకి వచ్చిన రెండవ సినిమాతోనే ఆ రికార్డు సాధించి అందరిని అబ్బురపరిచారు తేజ సజ్జ (Teja Sajja). చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి ‘జాంబిరెడ్డి’ సినిమాతో హీరోగా మారి.. ఇప్పుడు ‘మిరాయ్’ సినిమాతో మరో సరికొత్త సంచలనం సృష్టించారు. అంతేకాదు సూపర్ హీరో కాన్సెప్ట్లో సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
రీసెంట్ గా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) తొలి దర్శకత్వంలో సూపర్ యోధ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు తేజా సజ్జ. మిరాయ్ అంటూ వచ్చిన ఈ సినిమా థియేటర్లలో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ స్టార్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఇందులో విలన్ పాత్ర పోషించగా.. జగపతిబాబు(Jagapathi Babu), శ్రియ శరన్(Sriya Saran)కీలకపాత్రలు పోషించారు. అలాగే రితిక నాయక్ (Ritika Nayak) ఇందులో హీరోయిన్ గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ , కృతి ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.అలా ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఇప్పుడు మళ్లీ ఇదే కాంబో సెట్ చేయడానికి బడా నిర్మాత దిల్ రాజు(Dil Raju) రంగంలోకి దిగారు.
ALSO READ:Rashmika – Vijay: హమ్మయ్య.. ఎంగేజ్మెంట్ ని అఫిషియల్ గా ప్రకటించిన రష్మిక.. పెళ్లి తేదీ ఫిక్స్!
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మళ్లీ కార్తీక్ ఘట్టమనేని, తేజ సజ్జ కలిసి పని చేయబోతున్నారట. ఈ విషయం తెలియడంతో అందరూ మిరాయ్ సీక్వెల్ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత దిల్ రాజు వీరితో కొత్త ప్రాజెక్టును నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే కథా చర్చలు జరిగాయని, ఇక త్వరలోనే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కాబోతోందని సమాచారం. ఏది ఏమైనా మిరాయ్ సినిమాతో మంచి విజయం అందుకున్న కార్తీక్ ఘట్టమనేని, తేజ ఇప్పుడు రాబోయే ఈ కొత్త ప్రాజెక్టుతో మరెలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
తేజ సజ్జ.. 1998లో చూడాలని ఉంది అనే సినిమా ద్వారా బాలినటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత రాజకుమారుడు, కలిసుందాం రా, యువరాజు, బాచి, దీవించండి, ప్రేమ సందడి, ఆకాశవీధిలో, ఇంద్ర, ఒట్టేసిచెబుతున్నా, గంగోత్రి, వసంతం, ఠాగూర్, అడవి రాముడు, సాంబ, ఛత్రపతి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ముఖ్యంగా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తేజ ఇప్పుడు అదే హీరోలకి పోటీగా నిలుస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. ఇకపోతే హీరోగా చేసింది మూడు నాలుగు చిత్రాలు అయినా ఈ చిత్రాలతో సాక్షి ఎక్స్లెన్స్ అవార్డు, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు, రేడియో సిటీ సినీ అవార్డులతో పాటు గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ కూడా దక్కించుకున్నారు.