BigTV English

Akhanda 2 vs OG : పవన్‌తో బాలయ్య వార్ ఫిక్స్… కానీ, చిన్న ట్విస్ట్ పెట్టారు

Akhanda 2 vs OG : పవన్‌తో బాలయ్య వార్ ఫిక్స్… కానీ, చిన్న ట్విస్ట్ పెట్టారు

Akhanda 2 vs OG : ఈ  ఏడాది బాలయ్య డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా యావరేజ్ టాక్ ని అందుకున్నా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని కొల్లగొట్టింది.. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సినిమాకు కలెక్షన్స్ రావడంతో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత బోయపాటితో అఖండ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అఘోర పాత్రలో కనిపించిన బాలయ్యను పెద్ద స్క్రీన్ మీద ఎప్పుడు ఎప్పుడు చూస్తామని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కావడం కష్టమే అంటూ ఓ వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో వినిపిస్తుంది. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు.


బాలయ్య vs పవన్ కళ్యాణ్.. 

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో గతంలో మూడు సినిమాలు తెరకెక్కాయి. ఈ మూడు కూడా మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు నాల్గవ సినిమాగా అఖండ సినిమాకు సీక్వెల్ సినిమా అఖండ 2 రాబోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆ డేట్ పై కన్ఫ్యూజన్ నెలకొంది. అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా వస్తుండడంతో, బాలయ్య సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. ఆ వార్తలకు తాజాగా చిత్రయూనిట్ చెక్ పెట్టేసింది. ముందుగా అనౌన్స్ చేసిన డేట్ లో ఎటువంటి మార్పులు లేవని క్లారిటీ ఇచ్చేసింది. అదే రోజున ఓజి రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.. మొత్తానికి పవన్ కళ్యాణ్ వర్సెస్ బాలయ్య సినిమాల కోసం ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రెండు సినిమాల్లో ఏ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో అని ఇప్పటినుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Also Read: మంగళవారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు .. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

అఖండ 2 మూవీ అప్డేట్.. 

ఎప్పుడు మాస్ డైలాగులతో యాక్షన్ కింగ్ లాగా కనిపించే బాలయ్య అఖండ సినిమాతో అఘోరగా ప్రేక్షకులను పలకరించాడు.. సినిమా స్టోరీ తో పాటు బాలయ్య లుక్, యాక్షన్ సీన్లు ప్రేక్షకులను ఆమంతం కట్టిపడేసాయి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం రాబోతున్న అఖండ 2 టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. అయితే ఇప్పటిదాకా వాయిదా అంటూ అధికారికంగా ఏమీ ప్రకటించకపోయినా.. గత నెలలో రిలీజ్ చేసిన టీజర్లో కూడా అదే డేట్ ప్రకటించినా… యూనిట్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం సినిమా పోస్ట్ పోన్ కానుందట. ‘అఖండ-2’ చిత్రీకరణ చాలా వరకు పూర్తయింది. కొంత టాకీ పార్ట్, పాటలు చిత్రీకరించాల్సి ఉంది. ప్రయాగలో అనుకున్న చివరి షెడ్యూల్ వర్షాల వల్ల క్యాన్సిల్ అయింది. త్వరలోనే ఆ షెడ్యూల్ ను పూర్తి చేసి ప్రమోషన్స్  ను మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు.. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై గోపీ అచంట, రామ్ అచంట భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సంయుక్త, హర్షాలీ మల్హోత్రా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు..

Related News

Boney Kapoor: ‘శివగామి‘ పాత్ర వివాదం.. శ్రీదేవిని అవమానపరిచారు.. పెదవి విప్పిన బోనీ కపూర్

OG: ఓజీపై తమన్ బిగ్ అప్డేట్.. గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ!

Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Big Stories

×