Bandla Ganesh : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడుగా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారారు బండ్ల గణేష్. గణేష్ నిర్మించిన చాలా సినిమాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. మొదట ప్రొడ్యూసర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టినప్పుడు ఆంజనేయులు, తీన్మార్ వంటి సినిమాలు ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి. ఆ తరువాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అయిపోయాడు బండ్ల గణేష్.
గబ్బర్ సింగ్ సినిమా సక్సెస్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీలో నిర్మాతగా సెటిల్ అయిపోయారు బండ్ల. చిన్న సినిమాలు కాకుండా కేవలం స్టార్ హీరోస్ తోనే ప్రాజెక్టులు సెట్ చేసుకొని మంచి సక్సెస్ అందుకున్నారు. ఇద్దరమ్మాయిలతో, బాద్ షా, గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం బండ్ల గణేష్ సినిమాలు నిర్మించడం ఆపేశారు ఈ విషయం పైన తాజాగా బండ్ల స్పందించారు.
నిరజకోన దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలై డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఈ తరుణంలో సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కు బండ్ల గణేష్, ఎస్కేఎన్ కూడా హాజరయ్యారు.
ఎస్కేఎన్ మాట్లాడుతూ ఒక మేధావి మౌనం దేశానికే ప్రమాదకరం అని చిరంజీవి ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ చెబుతారు. అలానే మీలాంటి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సినిమాలు తీయకుండా ఉండడం అనేది ఇండస్ట్రీకి ప్రమాదకరం అని ఎస్ కే ఎన్ బండ్ల గణేష్ ను ఉద్దేశిస్తూ మాట్లాడారు.
అసలు బండ్ల గణేష్ సినిమాలు నిర్మించడం ఎందుకు ఆపేసారో ఎవరికి తెలియదు. ఎస్ కే ఎన్ మాటలపై బండ్ల గణేష్ స్పందిస్తూ… నేను సినిమాలు ఆపేయడం అనేది డిజాస్టర్ సినిమా తీసి ఆపేయలేదు. టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన తర్వాత సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఆపేసాను.
మళ్లీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది బ్లాక్ బస్టర్ సినిమా తీస్తాను అంటూ బండ్ల గణేష్ చెప్పారు. బండ్ల గణేష్ గత కొంతకాలంగా మంచి సినిమాలు తీస్తాను నిర్మిస్తాను. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ వస్తున్న రోజుల్లో దిగ్విజయంగా సాగిపోతుంది అని పలు సందర్భాల్లో చెప్పారు. ఇక త్వరలోనే సినిమాను అనౌన్స్ చేస్తారేమో వేచి చూడాలి.
Also Read: Mari Selvaraj : మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్? బైసన్ సినిమా పై సూపర్ స్టార్ రియాక్షన్