Hansika Motwani: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి నిత్యం ఎన్నో రకాల వార్తలు వినపడుతూనే ఉంటాయి. వారికి సంబంధించిన విషయాలలో ఏ చిన్న మార్పు కనిపించిన వారి గురించి ఎన్నో వార్తలు బయటకు వస్తుంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీ కపుల్స్ కలిసి కనిపించకపోయిన, కాస్త పేరు మార్చుకున్న విడాకులు తీసుకొని విడిపోయారనే వార్తలు బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా విడాకుల విషయంలో ఎంతోమంది సెలబ్రిటీలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.. ఈ కోవకు చెందిన వారే నటి హన్సిక మోత్వాని(Hansika Motwani). దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీని ఏలారు.
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న హన్సిక అనంతరం బాలీవుడ్ బాట పట్టారు.. కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్న ఈమె తన స్నేహితుడు బిజినెస్ పార్ట్నర్ సోహెల్ కతురియా(Sohel Kathuria) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. కొంతకాలం పాటు ఈ దంపతులు తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని అందుకే వీరిద్దరు విడాకులు(Divorce) తీసుకొని విడిపోయారని వార్తలు హల్చల్ చేశాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరు తమ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను కూడా డిలీట్ చేశారు.
ఇలా విడాకుల గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఈ జంట ఈ వార్తలను ఎక్కడ ఖండించలేదు. ఇకపోతే తాజాగా హన్సిక తన సోషల్ మీడియా ఖాతాలో కూడా తన పేరును మార్చుకున్నారు.Motwani అనే పేరును కాస్తా Motwanni గా మార్చుకోవడంతో విడాకులు కన్ఫర్మ్ అయ్యాయని అందుకే ఈమె పేరు కూడా మార్చుకుందనే వార్తలు తెరపైకి వచ్చే అయితే తాజాగా తన పేరు మార్చుకోవడానికి గల కారణాలను హన్సిక వెల్లడించారు.
పేరు మాత్రమే మార్చుకున్నా..
తన వ్యక్తిగత కారణాలవల్ల పేరు మార్చుకోలేదని హన్సిక క్లారిటీ ఇచ్చారు. ఇలా పేరు మార్చుకోవడం అనే ఐడియా తన తల్లిదని ఆమె న్యూమరాలజీని బాగా నమ్ముతారని తెలిపారు. ఇలా కొత్త స్పెల్లింగ్ చేర్చడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని తన తల్లి తనకు సూచించినట్లు ఈమె తెలిపారు.అమ్మ నమ్మకం ప్రకారమే తాను తన పేరును మాత్రమే మార్చుకున్నానని, నా వ్యక్తిగత జీవితాన్ని కాదు అంటూ హన్సిక వెల్లడించారు. ఇలా హన్సిక ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో ఈమె విడాకులు తీసుకోలేదని కేవలం న్యూమరాలజీ ప్రకారమే పేరు మార్చుకున్నారని క్లారిటీ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొంత కాలంగా హన్సిక సోహెల్ ఎక్కడ కలిసి కనిపించకపోవడం గమనార్హం.
Also Read: Akhil -Zainab: అఖిల్ జైనాబ్ మొదటి దీపావళి.. పెళ్లి తరువాత ఫస్ట్ టైం దర్శనమిచ్చిన కొత్త జంట!