Mari Selvaraj: తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో మారి సెల్వరాజ్ ఒకరు. ఇప్పటివరకు మారి సెల్వరాజ్ తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అయితే మారి సెల్వరాజ్ గురించి ఒక కంప్లైంట్ ఉంది. తను ఏ సినిమా తీసుకున్న కూడా అణగారిన వర్గాలు మరియు ఆధిపత్య వర్గాలు ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. దీని గురించి కూడా మారీ సెల్వ రాజ్ రీసెంట్ గా స్పందిస్తూ నేను అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను కాబట్టి వాళ్ల బాధలు నాకు తెలుసు కాబట్టి ఆ కథను నేను చెప్పాలనుకుంటున్నాను అని క్లారిటీ కూడా పలు సందర్భాల్లో ఇచ్చాడు.
ఇకపోతే చాలామంది కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎప్పుడూ ముందుంటారు. ఒక సినిమా నచ్చితే దానిని చూసి ఆ చిత్ర యూనిట్ని అభినందించడం సూపర్ స్టార్ కి అలవాటు. అలా ఎన్నో సినిమాలను ఆయన పొగిడారు. ఇక రీసెంట్ గా ధ్రువ విక్రమ్ నటించిన బైసన్ సినిమా చూసి రజనీకాంత్ కూడా రియాక్ట్ అయ్యారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ బైసన్ చూసి నాకు ఫోన్ ఫోన్ చేశారు. ఆయన నా వర్క్ ను అభినందించారు. ఈ వయసులో ధృవ్ విక్రమ్ పర్ఫామెన్స్ ను ఆయన అభినందించార. నేను మరియు సూపర్ స్టార్ చాలా స్క్రిప్ట్‌లను చర్చిస్తున్నాము, మేమిద్దరము కలిసి సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని రీసెంట్ గా జరిగిన ఒక తమిళ్ ప్రశ్న మీట్ లో మారి సెల్వరాజ్ చెప్పాడు.
ఇకపోతే రజినీకాంత్ ఇలా చాలామంది దర్శకులకు చెప్పారు. ఏ ప్రాజెక్టు ఎప్పుడు అవుతుందో ఎవరో ఊహించలేరు. రజనీకాంత్ చేతిలో కూడా ప్రస్తుతం విపరీతమైన ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు దర్శకుడు లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ తో మరో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నారు.
కమల్ హాసన్ రజినీకాంత్ హీరోలుగా మల్టీస్టారర్ సినిమా వస్తుంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను లోకేష్ కనగ రాజ్ డీల్ చేస్తాడు అని కూడా కథనాలు వినిపించాయి. కానీ లోకేష్ దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమా ఊహించిన రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయింది.
అయితే ఇప్పుడు ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఎవరికి వెళ్తుందో తెలియదు. ఈ ప్రాజెక్టు గురించి తమిళ్లో చాలామంది దర్శకులు ఎదురుచూస్తున్నారు. నెల్సన్ కూడా చేస్తాడు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు లోకేష్ కనగరాజ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే లోకేష్ కనక రాజ్ ఖైదీ 2 సినిమా చేయాల్సిన అవసరం ఉంది
Also Read: Director Maruthi : నానికి కథ చెప్తే, నాలో లోపాలు చెప్పాడు