BigTV English

Nikhil Swayambhu : శివరాత్రికి నిఖిల్ స్వయంభు? ఆ విషయం చిత్ర ఆలోచించలేదా?

Nikhil Swayambhu : శివరాత్రికి నిఖిల్ స్వయంభు? ఆ విషయం చిత్ర ఆలోచించలేదా?
Advertisement

Nikhil Swayambhu : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోస్ లో నిఖిల్ ఒకరు. ముందుగా కొన్ని సినిమాల్లో నటించిన నిఖిల్. శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాలో రాజేష్ అనే పాత్రతో అద్భుతమైన గుర్తింపు సాధించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా కూడా సినిమాలు చేసే అవకాశం సాధించుకున్నాడు.


నిఖిల్ కెరియర్ లో ఎన్నో డిఫరెంట్ సినిమాలు ఉన్నాయి. చందు మొండేటి, సుధీర్ వర్మ వంటి దర్శకులు నిఖిల్ కి స్నేహితులు. వారిద్దరు కూడా నిఖిల్ కి మంచి హిట్ సినిమాలు ఇచ్చారు. సుధీర్ వర్మ దర్శకుడుగా పరిచయమైన స్వామిరారా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అప్పటినుంచి చిన్న సినిమాల మీద చాలామందికి ఒక రకమైన అభిప్రాయం వచ్చింది. చందు మొండేటి దర్శకుడుగా పరిచయమైన కార్తికేయ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది.

శివరాత్రికి స్వయంభు

నిఖిల్ ప్రస్తుతం స్వయంభు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నిఖిల్ ఒక అద్భుతమైన పాత్రను చేస్తున్నారు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో నటిస్తోంది.


ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా 2026 ఫిబ్రవరి 15న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆరోజు ఆదివారం. మామూలుగా ఇండస్ట్రీలో సినిమాలన్నీ కూడా శుక్రవారం విడుదలవుతూ ఉంటాయి కానీ ఆదివారం శివరాత్రి ఫెస్టివల్ సందర్భంగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

మామూలుగా శుక్రవారం సినిమాలు విడుదలయితే శనివారం వీకెండ్ కాబట్టి కొంతమేరకు ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్కు వచ్చే అవకాశం ఉంది. అలానే ఆదివారం కూడా సెలవు కాబట్టి చాలామంది ప్రేక్షకులకు సినిమా రీచ్ అవుతుంది. ఈ తరుణంలో ఈ సినిమాను ఆదివారం రిలీజ్ చేయటం అనేది కొంతమేరకు సినిమాకు నష్టం కలిగించే విషయమే. మరి దీనిని చిత్ర యూనిట్ దృష్టిలో పెట్టుకోలేదా అని మాటలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

పాన్ ఇండియా కం బ్యాక్ 

చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. నిఖిల్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది. అక్కడితో నిఖిల్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది.

ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. తర్వాత చేసిన స్పై సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు. అయితే స్వయంభూ సినిమాతో నిఖిల్ మళ్లీ పాన్ ఇండియా రేంజ్ లో కం బ్యాక్ ఇస్తున్నాడు అనేది చాలామంది అభిప్రాయం. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Also Read: Skn : అగ్రిమెంట్ విషయంలో హీరోయిన్స్ కి ఖచ్చితంగా అది చెప్పాలి

Related News

Telusukada: తెలుసు కదా సినిమా ఫస్ట్  ఛాయిస్ సిద్దు కాదా..చేతులారా హిట్ సినిమా వదులుకున్న హీరో?

Akhanda 2 : ఇండస్ట్రీలో ఆ నెంబర్ సెంటిమెంట్, అనౌన్స్ చేస్తున్నారు కానీ పాటించట్లేదు

Skn : అగ్రిమెంట్ విషయంలో హీరోయిన్స్ కి ఖచ్చితంగా అది చెప్పాలి

Bandla Ganesh : నేను బ్లాక్ బస్టర్ సినిమాతో బ్రేక్ ఇచ్చా, డిజాస్టర్ సినిమాతో ఆపేయలేదు

Mari Selvaraj : మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్? బైసన్ సినిమా పై సూపర్ స్టార్ రియాక్షన్

Director Maruthi : నానికి కథ చెప్తే, నాలో లోపాలు చెప్పాడు

Hansika Motwani: విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన హన్సిక.. అందుకే పేరు మార్చుకున్నానంటూ!

Big Stories

×