Skn : నీరజకోన దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా తెలుసు కదా. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా ప్రస్తుతం డీసెంట్ టాక్ అయితే సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ఈవెంట్ నేడు నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కు ప్రముఖ నిర్మాత ఎస్ కే ఎన్ హాజరయ్యారు.
ఎస్ కే ఎన్ స్పీచ్ లు ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాసలు విపరీతంగా వాడుతుంటారు ఎస్ కే ఎన్. కొన్ని సందర్భాల్లో ఎస్ కే ఎన్ మాట్లాడే మాటలు కూడా చర్చనీయాంశం అవుతాయి. ఇక తెలుసు కదా ఈవెంట్లో ఎస్ కే ఎన్ మాట్లాడిన మాటలు మళ్ళీ వైరల్ అయ్యే అవకాశం ఉన్నాయి.
తెలుసు కదా సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ ఈవెంట్ కు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హాజరు కాలేదు. వాళ్లు హాజరు కాకపోవడానికి పలు రకాల కారణాలు ఉండొచ్చు. అయితే ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. నిర్మాత విశ్వప్రసాద్ గారి అగ్రిమెంట్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇప్పుడు ఆయన అగ్రిమెంట్స్ లో హీరోయిన్స్ కూడా ఖచ్చితంగా సక్సెస్ మీట్ కు హాజరు అవ్వాలి అనే పాయింట్స్ కూడా అగ్రిమెంట్లు యాడ్ చేయమని నేను కోరుకుంటున్నాను అని అడిగారు ఎస్కేఎన్.
ఈ రోజుల్లో సినిమాని విపరీతంగా ప్రమోట్ చేస్తే కానీ ప్రేక్షకులు దానిని ఆదరించరు. సినిమా చేసేసామా అయిపోయింది అనుకున్న వదిలేస్తే అక్కడితో ఆగిపోతుంది. కొన్ని సినిమాలను విపరీతంగా ప్రమోట్ చేసి అవి జనాల్లోకి వెళితేనే సరైన ఫలితాలు వస్తాయి. ఇలా సినిమాను ప్రమోట్ చేయడం వల్లనే సక్సెస్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి.
కిరణ్ అబ్బవరం నటించిన K-Ramp సినిమాకు మొదట కొద్దిపాటి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో ఆ రివ్యూ చూసి కొంతవరకు టీం కూడా భయపడింది. కానీ అక్కడితో ఆగిపోకుండా థియేటర్స్ లో ఆడియన్స్ తో సినిమా చూసి అక్కడ సినిమాను ప్రమోట్ చేయడం వల్ల అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి.
సాయంత్రానికి ఆ సినిమాకు కొన్నిచోట్ల హైస్కూల్ బోర్డ్స్ కూడా పడ్డాయి. అలా సినిమాను విపరీతంగా ప్రమోట్ చేయడం వల్లనే మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హీరోయిన్లు కూడా సినిమాలో నటించిన తర్వాత అయిపోయింది అని కాకుండా ప్రమోషన్స్ లో కూడా భాగం అవ్వాలి. సక్సెస్ మీట్ కి హాజరై మరికొన్ని మాటలు చెప్పటం వలన ఇంకొంతమంది ఆడియన్స్ సినిమా చూసే అవకాశం కూడా ఉంటుంది.
Also Read: Bandla Ganesh : నేను బ్లాక్ బస్టర్ సినిమాతో బ్రేక్ ఇచ్చా, డిజాస్టర్ సినిమాతో ఆపేయలేదు