E-Paper
Advertisement

జపాన్ లో ‘లెనిన్’ రిలీజ్… ఫ్యాన్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్..

జపాన్ లో ‘లెనిన్’ రిలీజ్… ఫ్యాన్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్..
Advertisement

Lenin movie: అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లెనిన్(Lenin movie). ఈ సినిమా తెలుగులో సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక తెలుగులో ఈ సినిమా ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ అలాగే టెలివిజన్ ప్రీమియర్ కూడా ఆయన సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ చిత్రాన్ని జపాన్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో అఖిల్ అక్కినేని (Akkineni Akhil)జపాన్ లో ల్యాండ్ అయ్యారు. ఈ సినిమా డిసెంబర్ 11వ తేదీ జపాన్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో స్పెషల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేశారు.

లెనిన్ స్పెషల్ స్క్రీనింగ్స్..

డిసెంబర్ 11వ తేదీ ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఫ్యాన్స్ కోసం రెండు రోజులు స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు మేకర్స్ తెలియజేశారు.డిసెంబర్ 11న జపాన్ వ్యాప్తంగా 40 స్క్రీన్‌లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక నవంబర్ 27, 28 తేదీలలో రెండు రోజుల పాటు నాలుగు ప్రత్యేక ప్రీమియర్ స్క్రీనింగ్‌లను నిర్వహిస్తున్నారు. ఇలా ఈ ప్రీమియర్ షోల తర్వాత నటుడు అక్కినేని అఖిల్ అభిమానులను కలిసి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. నవంబర్ 27వ తేదీ శుక్రవారం రాత్రి 7 గంటలకు 109 సినిమాస్ కిబా, టోక్యోలో స్పెషల్ స్క్రీనింగ్ వేయబోతున్నారు.

జపాన్ లో విడుదల..

Advertisement

ఇక 28వ తేదీఉదయం 10:00 గంటలకు ఏయాన్ సినిమా ఇచికావా మ్యోడెన్ (AEON Cinema Ichikawa Myoden).మధ్యాహ్నం 12:30 గంటలకు హ్యూమన్ ట్రస్ట్ సినిమా షిబుయా,మధ్యాహ్నం 3:00 గంటలకు సినీసిట్టా కవాసాకిలలో ప్రత్యేకమైన ప్రదర్శనలు వేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను చిత్ర నిర్మాతలు అధికారికంగా తెలియజేశారు. జపాన్ లో ఈ సినిమా జపనీస్ సబ్ టైటిల్ తో విడుదల కాబోతుందని తెలుస్తోంది. మరి తెలుగులో మంచి సక్సెస్ అందుకున్న ఈ చిత్రం జపనీస్ లో ఏ విధమైనటువంటి ఆదరణ పొందుతుందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో లెనిన్ జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో కొనసాగే కథగ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.గ్రామంలో ప్రతి ఏటా జరిగే ద్రౌపది జాతర ప్రతిష్ఠ, అధికారం చుట్టూ గ్రామ రాజకీయాలు తిరుగుతాయి. లెనిన్ కెరియర్ లోనే అతిపెద్ద బ్లాక్ బాస్టర్ సినిమా అని చెప్పాలి. ఇదివరకు ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ ఏ ఒక్క సినిమా ద్వారా సక్సెస్ అందుకోలేకపోయారు. లెనిన్ సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ కొట్టారని చెప్పాలి.. ఇలా తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ చిత్రం జపాన్ విడుదలకు సిద్ధమైంది. మరి అక్కడ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

Also Read: జగ్గు భాయ్ మంచి మనసు.. వారికి స్పెషల్ బిర్యానీలు.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

Related News

జగ్గు భాయ్ మంచి మనసు.. వారికి స్పెషల్ బిర్యానీలు.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

ఫేక్ పీఆర్ ప్రచారంతో మరో హీరో బలైపోతున్నాడా?

అల్లు స్నేహా రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం.. దూసుకు వచ్చిన కారు?

రిలాక్స్ మోడ్ లో సంయుక్త.. పాదాలే పాఠం చెబుతాయంటూ!

కార్తీ ‘ఖైదీ’ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో?

బేబీ దర్శక నిర్మాతలకు బిగ్ షాక్..హైకోర్టు నోటీసులు!

‘భోగి’పై అంత హైప్ ఇచ్చారు కదరా.. పేస్టింగ్ ఖర్చులు అయినా వస్తాయా?

Big Stories

Advertisement
×