Baby Movie:యువత ఫేవరెట్ మూవీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న చిత్రం బేబీ (Baby). ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. దర్శకుడు సాయి రాజేష్ (Sai Rajesh), నిర్మాత ఎస్ కే ఎన్ (SKN ) కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) , వైష్ణవి చైతన్య (Vaishnavi chaitanya) కీలక పాత్రలు పోషించారు. అటు థియేటర్లలో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. అలాంటి ఈ సినిమాకి తాజాగా హైకోర్టు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ డైరెక్టర్ శిరీన్ శ్రీరామ్ (Shirin Sriram) తన రచయితల బృందంతో కలిసి అభివృద్ధి చేసిన ‘ప్రేమించొద్దు’ అనే సినిమా కథను అనుమతి లేకుండా బేబీ సినిమా నిర్మాణంలో ఉపయోగించారని ఆరోపణలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటీషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ , నిర్మాత ఎస్ కే ఎన్ లకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..
ఇకపోతే శిరిన్ శ్రీరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. “మొదట సాయి రాజేష్ ప్రేమించొద్దు సినిమాను నిర్మించాలనే ఆసక్తితో నన్ను సంప్రదించారు. నేను, నా రచయితల బృందంతో కలిసి దాదాపు ఏడాది పాటు శ్రమించి కథను అభివృద్ధి చేశాము. అయితే కథకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని, దాని అభివృద్ధి ప్రక్రియ పూర్తయిన తర్వాత సాయి రాజేష్ మాతో సంబంధం లేకుండా ఆ కథాంశాన్ని ఆధారంగా చేసుకుని స్వతంత్రంగా బేబీ సినిమాను తెరకెక్కించారు. ఈ వ్యవహారంలో నేను, నా రచయితల బృందం మోసపోయాము” అంటూ తన నోటీసులలో తెలిపారు.
also read:‘భోగి’పై అంత హైప్ ఇచ్చారు కదరా.. పేస్టింగ్ ఖర్చులు అయినా వస్తాయా?
రెండేళ్ల క్రితమే ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. తన కథను అనుమతి లేకుండా ఉపయోగించారంటూ శిరిన్ శ్రీరామ్ 2024 ఫిబ్రవరిలోనే తొలిసారి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం కథను కాపీ చేయడం, మోసం వంటి ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించినప్పుడు ‘బేబీ లీక్స్’ పేరిట ఒక పుస్తకం కూడా విడుదల చేశారు డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్. ఇక పిటీషనర్ తరపున న్యాయవాది జి సురేందర్ వాదనలు వినిపించగా వాటిని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు బేబీ డైరెక్టర్ కి , నిర్మాతకు నోటీసులు జారీ చేసింది.. అంతేకాదు ఆరోపణలపై తక్షణమే వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఇక కథను కాపీ కొట్టారు అంటూ గత రెండేళ్లుగా పోరాడుతున్న డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ కి న్యాయం దక్కాలి అంటూ ఆయన అభిమానులు, సినీ ఆడియన్స్ కూడా ఆకాంక్షిస్తున్నారు. మరి చూద్దాం ఇందులో నిజా నిజాలు ఎవరికి అనుకూలంగా ఉండనున్నాయో..