Samyuktha Menon:అమాయకంగా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకోవడమే కాకుండా..ఇంత పెద్ద కల్లేసి చూస్తూ భయం పుట్టించడంలో కూడా ఈమె తర్వాతే ఎవరైనా.. అలాంటి సంయుక్త తొలిసారి ‘భీమ్లా నాయక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో రానా భార్యగా నటించి మొదటి ప్రయత్నంలోనే ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. అలాంటి సంయుక్త మీనన్ ‘బింబిసార’ సినిమాతో పూర్తిస్థాయి హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకుని.. ‘సార్’ అనే మరో తెలుగు చిత్రంతో టాలీవుడ్లో హ్యాట్రిక్ అందుకుంది. అప్పటివరకు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. తొలిసారి విరూపాక్ష అనే హారర్ మూవీలో నటించి అందరిని భయపెట్టింది. అంతేకాదు ఇటీవల నాటక రంగ స్థలం పై నవరసాలు పండించి అందరి దృష్టిని ఆకర్షించింది సంయుక్తా మీనన్.
అలాంటి సంయుక్త చివరిగా శర్వానంద్ హీరోగా నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలో హీరోయిన్గా నటించి.. ఇప్పుడు వరుస పెట్టి ప్రాజెక్ట్‌లలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఒకవైపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ‘హైందవ’ సినిమాలో నటించిన ఈమె.. నవంబర్ 27న అనగా నేడు ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది.
ఇక ఈ చిత్రంతోపాటు విజయ్ సేతుపతి , పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న ‘స్లమ్ డాగ్ 33 : టెంపుల్ రోడ్’ , నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభు’ చిత్రాలతో పాటు తన తొలి నిర్మాణంలో లీడ్ రోల్ పోషిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది బ్లాక్ గోల్డ్’.. సినిమాల షూటింగ్ లతో తలమునకలవుతున్న ఈమె తాజాగా కాస్త రిలాక్స్ మోడ్ లో కనిపించింది.
వరుస సినిమాల షూటింగ్ ల వల్ల ఇంస్టాగ్రామ్ లో అప్పుడప్పుడు మాత్రమే ఫోటోలు షేర్ చేస్తున్న ఈమె.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు మనసుకు హాయిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయి తనకు ఇష్టమైన పాటను వింటూ జలపాతం పక్కన విశ్రాంతి తీసుకుంటూ ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసింది.
also read:నా జీవితంలో దారుణమైన చీకటి రోజులవే: రోహిత్!
ఇకపోతే 2000 సంవత్సరంలో అర్జున్, జ్యోతిక , మీనా, రమేష్ అరవింద్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రిథమ్ . ఏ ఆర్ రెహమాన్ సంగీతంలో వైరా ముత్తు సాహిత్యం అందించిన “అన్బే ఇదు” సాంగ్ మ్యూజిక్ ను వింటూ చాలా రిలాక్స్డ్ గా కనిపించింది . పైగా ఈ పాట గత 12 సంవత్సరాలుగా తన ప్లే లిస్టులో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుందని సంయుక్త తెలిపింది. మొత్తానికి అయితే తన ఫేవరెట్ సాంగ్ వింటూ ప్రశాంతంగా కనిపించిన సంయుక్త మీనన్ ను చూసి అభిమానులు లవ్ ఎమోజీ లు షేర్ చేస్తున్నారు. ఇకపోతే పాటకు తగ్గట్టుగా ఆమె తన పాదాలతో ఇస్తున్న మూమెంట్స్ చూసి పాదాలే పాఠాలు చెబుతాయి సఖి అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.