E-Paper
Advertisement

‘భోగి’పై అంత హైప్ ఇచ్చారు కదరా.. పేస్టింగ్ ఖర్చులు అయినా వస్తాయా?

‘భోగి’పై అంత హైప్ ఇచ్చారు కదరా.. పేస్టింగ్ ఖర్చులు అయినా వస్తాయా?
Advertisement

Bhogi Movie:ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు శర్వానంద్. అలాంటి ఈయన చివరిగా నారీ నారీ నడుమ మురారి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన బైకర్ చిత్రం కూడా యువతతో పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలి అనే ఆలోచనతో సంపత్ నంది డైరెక్షన్లో ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ లో తొలిసారి రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించాలని ఎంతో కష్టపడ్డారు శర్వానంద్. అలా పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా వచ్చిన భోగి చిత్రంతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో డింపుల్ హయతి , అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

ట్రైలర్ తోనే ఊహించని బజ్ క్రియేట్ చేసిన చిత్ర బృందం..

సినిమా ట్రైలర్ విడుదల కాకముందు వరకు సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. ట్రైలర్ మాత్రం ఒక రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అసలు బొమ్మ ఎలా ఉండబోతోంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. అసలు శర్వానంద్ ఇలాంటి ఒక రూటేడ్ క్యారెక్టర్ ను ఎలా ఓన్ చేసుకున్నారో చూడాలని చాలామంది ఎదురు చూశారు కూడా. విలేజ్ యాక్షన్ డ్రామా అని ప్రమోషనల్ కంటెంట్ తో క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఆ విలేజ్లో ఏం చూపిస్తాడు? అక్కడ ప్రేక్షకులను ఎక్సైట్ చేసే పాయింట్ ఏముంది? ఆ విలేజ్లోకి ఆడియన్స్ ను డైరెక్టర్ తీసుకెళ్తాడా? ఇలా ఎన్నో మిలియన్ డాలర్ల ప్రశ్నలతో సినిమాపై ఊహించని క్యూరియాసిటీని పెంచేశారు. దీనికి తోడు ఇప్పటివరకు శర్వానంద్ తన కెరియర్ లో నటించిన చిత్రాలు ఒక ఎత్తైతే.. ఈ సినిమా మరో ఎత్తు అనే రేంజ్ లో భారీగా హైప్ క్రియేట్ చేశారు. కట్ చేస్తే బొమ్మ బ్లాక్ బాస్టర్ అనుకున్న వారందరికీ దిమ్మతిరిగే షాక్ తగిలింది అని చెప్పాలి.

పాత కథనే జిరాక్స్ తీసారా?

Advertisement

రంగస్థలం ఫార్ములా ను తీసుకొచ్చి దానికి కాస్త ఎర్రటి రక్తం, అరుపుల మసాలా కలిపి భోగి అంటూ మన నెత్తిన రుద్దారు సంపత్ నంది. ఆ పల్లెటూరి డ్రామా చివరికి ఏమలుపు తిరిగింది ? చూసే వాళ్ళ ఓపిక ఏ స్థాయికి చేరుకుంది? అనేది కథ ..నిజానికి పాత సినిమా కథను జిరాక్స్ తీసి ఒరిజినల్ మ్యాజిక్ లో కనీసం 10% కూడా లేకుండా వదిలేస్తే ఎలా ఉంటుంది. అలాగే ఉంటుంది ఈ భోగి వ్యవహారం .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చెవుల్లో డీజే పెట్టినట్లు గింగరాలు కొట్టిస్తుంటే .క్లైమాక్స్ మాత్రం ఏ ఆయువు పట్టు లేకుండా సాగదీతతో ప్రేక్షకుడి ప్రాణాలు తీసేలా సాగుతుంది. ఎన్నో అంచనాలు పెట్టుకుని వెళ్లిన ఆడియన్స్ కి పూర్తి నిరాశను మిగిల్చారు చిత్ర బృందం.

also read:త్వరలో నంది అవార్డ్స్ ప్రధానోత్సవం.. కొత్త బాధ్యతలు చేపట్టిన బాలయ్య!

నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టం..

Advertisement

సినిమా ఫలితం చూసి అటు డిస్ట్రిబ్యూటర్లు కూడా లబోదిబోమంటున్నారు. నిజానికి ఈ సినిమా బడ్జెట్ అంతా కలిపి 53 కోట్లు. ఇందులో నాన్ థియేట్రికల్ ఆదాయం రూ . 20 కోట్లకు పైగా తిరిగి వచ్చింది. మరి థియేటర్ల సంగతేంటి? సినిమా టాక్ చూసిన తర్వాత.. కొనుగోలుదారులకు కనీసం పోస్టర్లు అతికించడానికి అయిన ఖర్చులైనా వస్తాయా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిర్మాత సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. కానీ థియేటర్లలో మొదటి టాక్ తోనే ఈ సినిమా ఘోరమైన పరాభవాన్ని దక్కించుకుంది . మరి ఈ సినిమా కొన్న బయ్యర్లు ఈ సినిమా కోసం ఖర్చుపెట్టిన నిర్మాతకి నష్టం తప్పదు అని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.. ఏది ఏమైనా ఈ సినిమాకు సంతోషించిన ఏకైక వ్యక్తి ఆ ఓడ కెప్టెన్ మాత్రమే అని చెప్పాలి. ఓవరాల్ గా చెప్పాలి అంటే రేటింగ్ కూడా ఇవ్వలేని ఘోర పరాభవాన్ని భోగి చవిచూసింది..

Related News

త్వరలో నంది అవార్డ్స్ ప్రధానోత్సవం.. కొత్త బాధ్యతలు చేపట్టిన బాలయ్య!

Aditirao Hydari : ఏంటి.. ఒక్క నెలకు అంత సంపాదిస్తుందా..?

నాని నా బెస్ట్ ఫ్రెండ్.. 20 ఏళ్ల స్నేహంపై నితిన్ ఎమోషనల్ కామెంట్స్!

పెళ్లి పీటలు ఎక్కబోతున్న అడివి శేష్.. అమ్మాయి పేరు కూడా రివీల్!

సుధాకర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. నెలరోజులు కోమాలోనే.. కొడుకు ఏమన్నాడంటే !

గీతా ఆర్ట్స్‌లో మ్యారేజ్ బ్యూరో.. అల్లు అరవింద్ అదిరిపోయే పంచ్!

అఖిల్ జీవితంలో మోస్ట్ స్పెషల్ మూమెంట్.. జైనబ్‌తో జపాన్‌లో రొమాంటిక్ పిక్!

Big Stories

Advertisement
×