Jagapathi Babu : జగపతిబాబు పరిచయం అవసరం లేని పేరు. సినీ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న జగపతిబాబు ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వరుస సినిమాలలో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న జగపతిబాబు మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా జగపతిబాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన అభిమానులు జగపతిబాబుపై ప్రశంసలకు కురిపిస్తున్నారు.
జగపతిబాబు తన ఇంట్లో పని చేస్తున్న కొంతమంది వర్కర్స్ కి సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా తన ఇంట్లో పని చేస్తున్న పని వాళ్ళ వారి క్యారేజీ పై జగ్గు భాయ్ దాడి చేశారు. వాళ్లు తీసుకువచ్చిన క్యారేజీని ఈయన తిన్నారు. అదే విధంగా వారికోసం ప్రత్యేకంగా బిర్యానీ తెప్పించి మరి వారికి స్వయంగా వడ్డించి వారితో పాటు కలిసి భోజనం చేశారు. ఇలా ఈ ఫుడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా ఈ వీడియోని షేర్ చేసిన జగపతిబాబు.. ఉదయం నాలుగు గిన్నెల అన్నం తిన్న జగ్గూభాయ్.. రాత్రి భోజనంతో ఊరందరినీ మించిపోయారు. ఏంటీ తిండిపోతుతనం!అంటూ సరదాగా పోస్ట్ చేశారు.
ఇలా జగపతిబాబు తన ఇంట్లో పని చేస్తున్న వర్కర్లతో ప్రేమగా ఆప్యాయతగా ఉంటూ వారికి కడుపునిండా భోజనం పెట్టడంతో జగపతిబాబు తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు . చాలామంది డబ్బు సంపాదిస్తారు కానీ దానిని ఇతరుల కోసం ఖర్చు చేయరని అలా చేయాలంటే గొప్ప మనసు కూడా ఉండాలి అని కామెంట్లు చేస్తున్నారు. ఇక జగపతిబాబు తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు. సంపన్నమైన కుటుంబంలో జన్మించిన జగపతిబాబు హీరోగా సూపర్ సక్సెస్ అందుకున్నారు.
Breaking News… Jantaki oka koora, 4 muddhala Annam thinni Rojjantha pani chesthuntey , noru oori valla bojjanam medha dhaadi chesadu Jaggu Bhai 😋 Idhiyemi Muchatooooo… pic.twitter.com/YQ9pQReDcX
— Jaggu Bhai (@IamJagguBhai) November 26, 2026
ఇలా తన జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఈయన ఒక్కసారిగా తన ఆస్తులు అన్నింటిని కోల్పోయి సాధారణ స్థితికి వచ్చారు. ఎవరైనా ఒక్క అవకాశం కల్పిస్తే చాలు అని ఎదురుచూసిన క్షణం నుంచి ఇప్పుడు క్షణం తీరిక లేకుండా సినిమాలు చేసే స్థాయికి వెళ్లారు.నటుడిగా ఎన్నో విజయాలు అందుకున్నప్పటికీ ఆయనలోని నిరాడంబరత మాత్రం మారలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటకు ఆయన వ్యక్తిత్వం ఉదాహరణగా నిలుస్తోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. ఇక ప్రస్తుతం జగపతిబాబు తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా విలన్ పాత్రలలోను అలాగే తండ్రి పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు వ్యాఖ్యాతగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Also Read: అల్లు స్నేహా రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం.. దూసుకు వచ్చిన కారు?