Allu Sneha Reddy: అల్లు స్నేహారెడ్డి పరిచయం అవసరం లేని పేరు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)సతీమణిగా అందరికీ ఎంతో సుపరిచితమే. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కాకపోయినప్పటికీ స్నేహ రెడ్డి(Allu Sneha Reddy)కి మాత్రం హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ తన కెరియర్ అలాగే బన్నీ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తెలియజేస్తూ ఈమె సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.
ఇకపోతే తాజాగా అల్లు స్నేహారెడ్డికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ఈమె రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారని చెప్పాలి. ఇలా ఈ వీడియోలో స్నేహ రెడ్డికి తప్పిన ఈ ప్రమాదం గురించి తెలిసిన అల్లు అర్జున్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అల్లు స్నేహారెడ్డికి ప్రమాదం జరగడం ఏంటి అనే విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం స్నేహ రెడ్డి ఫోర్ లైన్ రోడ్ దాటుతూ ఉన్న సమయంలో రోడ్డుపై ఒక కారు చాలా వేగంతో దూసుకు వచ్చింది. ఇలా కారు స్పీడ్ గా వస్తున్నది చూసి స్నేహ రెడ్డి ఒక్కసారిగా రోడ్డుపైనే ఆగిపోయారు. ఇక కారు డ్రైవర్ కూడా సడన్గా బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది.
ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో అల్లు అభిమానులు కాస్త జాగ్రత్త వదిన అంటూ కామెంట్లు చేయగా మరికొందరు రోడ్డు దాటేటప్పుడు చూసుకోవాలి కదా అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. అయితే స్నేహ రెడ్డి ఎక్కడికి వెళ్ళింది ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది అనే విషయాల గురించి ఎక్కడ స్పష్టత లేదు కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి ఈ ప్రమాదం గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాలి అంటే అల్లు స్నేహ స్పందించాల్సి ఉంటుంది.
?gwpx=bGUxZzgxYnRmaGx3
ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం వరుస సినిమా పనులలో బిజీగా ఉన్నారు. పుష్ప 2 తర్వత అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల కాలంలో ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు కూడా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు పూర్తి అయ్యింది, ఈ సినిమా విడుదల వంటి విషయాల గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: ఝాన్సీ పుట్టినరోజు.. మంచి పనికి శ్రీకారం చుట్టిన రైతుబిడ్డ.. ఫ్యాన్స్ కు స్పెషల్ రిక్వెస్ట్!