E-Paper
Advertisement

ఫేక్ పీఆర్ ప్రచారంతో మరో హీరో బలైపోతున్నాడా?

ఫేక్ పీఆర్ ప్రచారంతో మరో హీరో బలైపోతున్నాడా?
Advertisement

Film industry:సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అంతా సోషల్ మీడియా మాయాజాలం నడుస్తోంది. సినిమా ఎలా ఉన్నా సరే, డబ్బులు పెట్టి ట్విట్టర్‌లో ట్రెండ్ చేయడం, ఫేక్ ఫ్యాన్స్‌తో ఎలివేషన్లు ఇప్పించడం కామన్ అయిపోయింది. అయితే ఇలాంటి ఆర్టిఫిషియల్ హైప్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందనే మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ప్రశాంతంగా ఉండే ఓ హీరో కూడా ఈ పీఆర్ వలలో పడిపోయాడా? ఆయన కొత్త సినిమాకు బజ్ ఎందుకు రావట్లేదు? ఆ అసలు లెక్కేంటో చూద్దాం..

సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజమా?:

ఈ మధ్య ఏ సినిమా టీజర్ వచ్చినా, పోస్టర్ వచ్చినా సోషల్ మీడియాలో “బ్లాక్‌బస్టర్”, “ఇండస్ట్రీ హిట్” అంటూ హడావుడి మొదలవుతోంది. నిజానికి ఇవన్నీ సాధారణ ఆడియన్స్ నుంచి వచ్చే మాటలు కావు. పీఆర్ టీమ్స్ డబ్బులిచ్చి చేయించే ఫేక్ రివ్యూలు, పెయిడ్ పోస్టులు మాత్రమే. ఇక బయట థియేటర్ల దగ్గర ఉండే రియాలిటీకి, ఆన్‌లైన్‌లో కనిపించే హంగామాకు అస్సలు సంబంధం ఉండటం లేదు.

ఆ కూల్ హీరో విషయంలో ఏం జరుగుతోంది?:

Advertisement

సాధారణంగా ఎలాంటి హడావుడి లేకుండా, తన పని తాను చేసుకుపోయే ఒక యంగ్ హీరో విషయంలోనూ ఈ మధ్య ఇలాంటి ఫేక్ ప్రచారం బాగా కనిపించింది. ఆయనకు గతం లో విపరీతమైన క్రేజ్ వుంది, తరువాత కొన్ని ఫ్లోప్స్ వచ్చాయి ..ఐతే ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయాడని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంటే,టీజర్ ,ట్రైలర్ ,ఇలా అన్ని వదిలిన ఆశించిన స్థాయిలో కనీస బజ్ కూడా కనిపించడం లేదు. దీన్నిబట్టే ఆ ఆన్‌లైన్ హైప్ అంతా ఉత్తిదేనని అర్థమవుతోంది.

హీరోలే ఆ భ్రమలో పడితే కష్టం:

పీఆర్ టీమ్స్ చేసే ఈ మాయను నిజమని నమ్మి, హీరోలు కూడా లేనిపోని ఆశలు పెట్టుకుంటే అసలు సమస్య మొదలవుతుంది. ఇక తమని తాము పెద్ద స్టార్లుగా ఊహించుకుని, కథల ఎంపికలో తప్పులు చేసే ప్రమాదం ఉంది. పైగా సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోతే, ఆ దెబ్బను తట్టుకోవడం చాలా కష్టమవుతుంది.

Advertisement

also read:రిలాక్స్ మోడ్ లో సంయుక్త.. పాదాలే పాఠం చెబుతాయంటూ!

కంటెంట్ బాగుంటేనే అసలైన క్రేజ్:

ఇక ఎన్ని లక్షలు పెట్టి ప్రచారం చేయించినా, సినిమాలో విషయం లేకపోతే ఆడియన్స్ థియేటర్‌కు రారు. ఫేక్ ఎలివేషన్లు కేవలం ఫోన్ స్క్రీన్ల వరకే పనికొస్తాయి కానీ, బాక్సాఫీస్ దగ్గర కాసులను కురిపించలేవు. అందుకే హీరోలు ఈ పీఆర్ మాయలో పడకుండా, మంచి కథల మీద ఫోకస్ పెడితేనే కెరీర్ సేఫ్‌గా ఉంటుంది.

Tags

Related News

అల్లు స్నేహా రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం.. దూసుకు వచ్చిన కారు?

రిలాక్స్ మోడ్ లో సంయుక్త.. పాదాలే పాఠం చెబుతాయంటూ!

కార్తీ ‘ఖైదీ’ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో?

బేబీ దర్శక నిర్మాతలకు బిగ్ షాక్..హైకోర్టు నోటీసులు!

‘భోగి’పై అంత హైప్ ఇచ్చారు కదరా.. పేస్టింగ్ ఖర్చులు అయినా వస్తాయా?

త్వరలో నంది అవార్డ్స్ ప్రధానోత్సవం.. కొత్త బాధ్యతలు చేపట్టిన బాలయ్య!

Aditirao Hydari : ఏంటి.. ఒక్క నెలకు అంత సంపాదిస్తుందా..?

Big Stories

Advertisement
×