Khaidi Movie:ఒక సినిమా కథను రూపొందించేటప్పుడే ఫలానా పాత్రలో ఫలానా హీరో లేదా హీరోయిన్ తో నటింపచేయాలి అని కథను తయారు చేస్తూ ఉంటారు. అయితే ఆ కథను ఫలానా వ్యక్తుల దగ్గరకు తీసుకెళ్లినప్పుడు కొంతమంది అన్ని అనుకూలించి ఓకే చెబితే.. మరి కొంతమంది డేట్స్ సర్దుబాటు కాక లేదా కథ నచ్చక లేదా ఇతర కారణాలవల్ల పాత్రలను మిస్ చేసుకుంటూ ఉంటారు. అయితే అవి విడుదలై మంచి విజయం అందుకున్న తర్వాత వదులుకున్న వారి అభిప్రాయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi ) కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నా.. 2019లో వచ్చిన ‘ఖైదీ’ సినిమా మాత్రం ఆయన కెరియర్ లో చాలా స్పెషల్ అనే చెప్పాలి లోకేష్ కనగరాజ్ (Lokesh kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ఈ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కార్తిని స్టార్ హీరోగా మరో మెట్టు ఎక్కించింది.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అంతేకాదు ఈ సినిమా కలెక్షన్లతో పాటు తెలుగు, తమిళ్ లో కూడా ఈ సినిమాకి రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. పైగా కార్తీ పోషించిన ఢిల్లీ పాత్ర సినిమాకు హైలెట్గా నిలిచింది. అటు కార్తీకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఇది. అంతేకాదు ఈ ఒక్క సినిమా లోకేష్ కనగరాజ్ కి ఇటు తెలుగులో కూడా మంచి ఆదరణ అందించిందని చెప్పాలి. అలాంటి ఈ సినిమా వచ్చి ఏడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇకపోతే తాజాగా వైరల్ అవుతున్న వార్త ఏమిటంటే.. ఈ సినిమా కోసం కార్తీ మొదటి ఛాయిస్ కాదట. ఈ సినిమా కోసం ముందుగా ఒక స్టార్ హీరోనే అనుకున్నారట. కానీ వివిధ కారణాలవల్ల ఆయన తప్పుకోవడంతో ఆఖరికి కార్తీకే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ పాత్రలో కార్తీ తప్ప మరెవరు సెట్ కారేమో అనిపించేలా కార్తీ తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
ఈ పాత్రను మిస్ చేసుకున్న హీరో ఎవరో కాదు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అందరితో పంచుకున్నారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ..” ఖైదీ సినిమా స్టోరీ అందరికంటే ముందు నా దగ్గరకే వచ్చింది. ఈ ప్రాజెక్టు గురించి చర్చలు కూడా జరిగాయి .కానీ కొన్ని కారణాలవల్ల అది ఫైనల్ అవ్వలేదు. అయితే కార్తీ ఈ సినిమా చేయాలనుకున్నారు. అందులో భాగంగానే ఆయన నాకు ఫోన్ చేసి.. “యోవ్ వీఎస్.. ఆ కథను నేను చేస్తానయ్యా”: అన్నారు .ఇక దానికి నేను “చాలా బాగా చేయండి సార్” అని చెప్పాను.
also read:బేబీ దర్శక నిర్మాతలకు బిగ్ షాక్..హైకోర్టు నోటీసులు!
అయితే ఈ సినిమా కథ గురించి నాకు ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే లోకేష్ నాకు బాగా తెలుసు .బ్రదర్ లాంటివాడు. అటు కార్తీ పై నాకు ఎంతో గౌరవం ఉంది . కథ విన్నప్పుడే ఈ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ అవుతుంది అనుకున్నాను. అటు తమిళ్, తెలుగులో కూడా ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని నేను వాళ్లతో చెప్పాను. ఇది ఒక అద్భుతమైన సినిమా.. అయితే ఇంత మంచి సినిమాను కోల్పోయినందుకు నేనెప్పుడూ కూడా బాధపడలేదు” అంటూ విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.