E-Paper
Advertisement

టాలీవుడ్‌ను టార్గెట్ చేసిన ‘రెహమాన్ డకాయత్’.. త్రివిక్రమ్ స్కెచ్ మామూలుగా లేదుగా!

టాలీవుడ్‌ను టార్గెట్ చేసిన ‘రెహమాన్ డకాయత్’.. త్రివిక్రమ్ స్కెచ్ మామూలుగా లేదుగా!
Advertisement

Akshaye Khanna: ‘దురంధర్’లో రణ్‌వీర్‌కు ఎంత పేరొచ్చిందో, రహమాన్ డకాయత్ పాత్రలో నటించిన అక్షయ్ ఖన్నాకు కూడా అంతే పేరు వచ్చింది అన్నది నిజం. ముఖ్యంగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అక్షయ్ చూపించిన ఇంటెన్సిటీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ గ్లోబల్ క్రేజ్‌ను గమనించిన టాలీవుడ్ మేకర్స్, ఆయన్ని తెలుగు తెరకు పరిచయం చేసే పనిలో పడ్డారు.

‘మహాకాళి’లో ‘శుక్రాచార్యుడి’ పాత్రలో

Advertisement

అలా ఇప్పటికే ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో భాగంగా చేస్తున్న ‘మహాకాళి’లో అక్షయ్ ఖన్నా ఒక పవర్‌ఫుల్ రోల్‌తో మెప్పించబోతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఖన్నా పుట్టినరోజు సందర్భంగా ఖన్నా ‘శుక్రాచార్యుడి’ పాత్రలో కనిపించబోతున్నారు అంటూ సాలిడ్ అప్డేట్ కూడా వదిలారు. ప్రశాంత్ వర్మ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. భూమి శెట్టి టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీలో అక్షయ్ ఖన్నా పాత్ర సినిమాలో కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది.

also read:రామ-లక్ష్మణులు వలస కూలీలా?ప్రకాష్ రాజ్ పై భగ్గుమంటున్న హిందూ సంఘాలు…వారణాసికి బాయ్‌కాట్ సెగ!

Advertisement

రెండింటిలోనూ అక్షయ్ ఖన్నా కోసం ఒక సాలిడ్ క్యారెక్టర్‌

ఇక ఇదిలా ఉండగా తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా అక్షయ్ ఖన్నా నటించబోతున్నాడన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ సినిమాతో పాటు ఎన్టీఆర్ హీరోగా ఒక భారీ పౌరాణిక ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటిలోనూ అక్షయ్ ఖన్నా కోసం ఒక సాలిడ్ క్యారెక్టర్‌ను గురూజీ లాక్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ‘డ్రాగన్’లో అనిల్ కపూర్, ‘వీరమల్లు’ సినిమాలో బాబీ డియోల్, ‘ఓజీ’లో ఇమ్రాన్ హాష్మి వంటి వారు టాలీవుడ్ బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు అక్షయ్ ఖన్నా వైపు చూడని మన మేకర్స్ ‘దురంధర్’ తర్వాత వెంట పడి క్యారెక్టర్స్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా టైమ్ రావడమంటే ఇదేనేమో.

క్రేజీ కాంబినేషన్లకు డోర్స్ ఓపెన్

ఒకవైపు త్రివిక్రమ్ సినిమాల్లోని క్లాస్ ఎమోషన్స్, మరోవైపు ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లోని పౌరాణిక విజువల్స్.. ఇలా రెండు విభిన్నమైన ప్రాజెక్టులతో అక్షయ్ ఖన్నా టాలీవుడ్ సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేస్తున్నాడు అక్షయ్ ఖన్నా. మొత్తానికి ‘రహమాన్ డకాయత్’గా బాలీవుడ్‌ను ఊపేసిన ఖన్నా ఇప్పుడు టాలీవుడ్‌ను ఊపేయడానికి సిద్ధమయ్యాడన్న మాట. ఇక అక్షయ్ ఖన్నా ఎంట్రీతో టాలీవుడ్‌లో మరిన్ని క్రేజీ కాంబినేషన్లకు డోర్స్ ఓపెన్ అవుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక ‘మహాకాళి’ విషయానికే వస్తే ఇప్పటికే 120 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుని చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరగబోయే చివరి 30 రోజుల షెడ్యూల్‌తో మొత్తం షూటింగ్ పూర్తికానుందట. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పౌరాణిక చిత్రం ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఒక విజువల్ వండర్‌గా నిలవబోతోందని మేకర్స్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు.చూడాలి మరి టాలీవుడ్‌పై సాలిడ్‌గా గురి పెట్టిన అక్షయ్ ఖన్నాకు ఈ సినిమా ఎలాంటి ఫలితం అందిస్తుందో!

also read :చిరాగ్ పాశ్వాన్‌తో ఎఫైర్? ‘పిల్లలు పుట్టేవాళ్లు’ అంటూ కంగనా షాకింగ్ కామెంట్స్.. సోషల్ మీడియా షేక్!

Related News

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

NBK 111:బాబాయ్ కోసం అబ్బాయ్ ఎమోషనల్ మెసేజ్.. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడంటే?

జాన్ అబ్రహం కొత్త ఇల్లు ఎంతో తెలుసా ..రేటు చూస్తే మతి పోవాల్సిందే !

Big Stories

Advertisement
×