Allu Arjun Reacts to Pushpa Song Performance: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రాలకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం ఒకదాని మించి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. పుష్ప 2 చేసిన రికార్డ్స్ అంతా ఇంత కాదు. ఇండియన్ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు సాధించి రెండో చిత్రంగా రికార్డు బ్రేక్ చేసింది. బాక్సాఫీసు వద్ద తగ్గేదే లే అంటూ వసూళ్ల మోత మోగించింది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నాలు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. పుష్పరాజ్ మ్యానరిజానికి వరల్డ్ వైడ్గా అభిమానులు ఉన్నారు.
బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత
తనదైన నటన, మ్యానరిజం వరల్డ్ వైడ్గా ప్రేక్షకులకు ఆకట్టుకున్నాడు పుష్పరాజ్. ఈ చిత్రాల రిలీజ్ టైంలో పుష్ప పాటలు మారుమోగాయి. ప్రతి పాట యూట్యూబ్లో ట్రెండింగ్ జాబితాలో నిలిచింది. ఇక ఇంటర్నేషన్ వేదికలపై కూడా తెలుగులోనే భాషల్లోనే పాటలు ప్రదర్శించడం విశేషం. ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా అని సమంత స్పెషల్ సాంగ్, శ్రీవల్ల పాటల మోతమోగించాయి. పార్ట్ 2లోని కిస్సిక్ సాంగ్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్, బీజీయంకు ప్రతి ప్రేక్షకులు ఫిదా అయ్యాడు. సినిమా విడుదలైన ఏడాదైన ఇంకా పుష్ప క్రేజ్ తగ్గలేదు. అమెరికాలోని ప్రముఖ షోలో తాజాగా పుష్ప పాటను ప్రదర్శించారు. ఇది చూసిన బన్నీ ట్విటర్లో ఇలా .
అమెరికా డ్యాన్స్ షోలో పుష్ప సాంగ్ పై ప్రదర్శన
కాగా అమెరికాలో టాలెంట్ రియాలిటీ షో గాట్ టాలెంట్ డ్యాన్స్ షో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇందులో ఇండియాకు చెందిన బీ యూనిక్ క్రూ టీం తమైన డ్యాన్స్తో ఆడియన్స్ సర్ప్రైజ్ చేస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో ఈ టీం పుష్ప సాంగ్తో ప్రదర్శన ఇచ్చారు. ఈపాటకు ఒళ్లు గగుర్పొడ్చేలా ప్రదర్శన ఇచ్చి అక్కడ ఉన్నవారందరిని ఆశ్చర్యపరిచారు. వారి ప్రదర్శన జడ్జీస్ అయితే నోళ్లు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వారి డ్యాన్స్ చేస్తున్నంత సేపు జడ్జస్ ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ షో ది బెస్ట్ పర్ఫామెన్స్ ఆఫ్ ది సీజన్గా కూడా నిలవడం విశేషం.
Wow … Mind Blowing . 🖤 https://t.co/pwVRkSpbqD
— Allu Arjun (@alluarjun) August 4, 2025
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. దీనికి పుష్ప మూవీ టీం కూడా తమ ట్విటర్లో షేర్ చేసింది. ఇది చూసిన బన్నీ మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియో రీ షేర్ చేస్తూ.. ‘వావ్.. మైండ్ బ్లోయింగ్’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా పుష్ప పార్ట్ 1 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ విజయ్ సాధించింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక దీనికి సీక్వెల్గా వచ్చిన ‘పుష్ప: ది రూల్’ అంతకు మించి అనేలా బాక్సాఫీసు వసూళ్లతో షేక్ చేసింది. మొత్తం ఈ సినిమా రూ. 1871పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.. దంగల్ తర్వాత స్థానంలో నిలిచింది. రూ. 2000 కోట్ల వసూళ్లతో దంగల్ మొదట స్తానంలో ఉండగా.. రూ. 1871కోట్లకు పైగా కలెక్షన్స్తో పుష్ప 2 రెండో స్థానంలో నిలిచింది.