Woaks one hand batting : ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య లండన్ లోని ఓవల్ వేదికగా మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ఉత్కంఠగా మారిన సమయంలో ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లు కోల్పోగా.. అందరూ ఇంగ్లాండ్ ఆలౌట్ అవుతుందని భావించారు. కానీ భుజానికి గాయం అయిన క్రిస్ వోక్స్ ఒంటి చేతితో బ్యాటింగ్ చేసేందుకు గ్రౌండ్ లోకి బరిలోకి దిగాడు. వోక్స్ ఒంటిచేతితో తమ దేశాన్ని గెలిపించాలని స్టేడియంలోకి రాగానే.. అభిమానులు అంతా క్లాప్స్ తో స్వాగతం పలికారు. ఇక వోక్స్ ఒంటి చేతితో బ్యాటింగ్ వచ్చాడు. కానీ రెండు ఓవర్ల వరకు వోక్స్ ఒక్క బంతి కూడా ఎదుర్కోలేదు. చివరి బంతికి కచ్చితంగా సింగిల్ తీసుకుంటున్నారు రెండు ఓవర్లు కూడా అలాగే ఆడారు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఓవర్ లో చివరి బంతికి సింగిల్ తీసుకున్నాడు అట్కిన్సన్. ఆ తరువాత ఓవర్ మహ్మద్ సిరాజ్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read : ENG Vs IND 5th Test : ఐదో టెస్టులో టీమిండియా షాకింగ్ విజయం.. 35 పరుగులు కొట్టలేక
వోక్స్ కి హ్యాట్సాప్
చివరి బంతులు సింగిల్ తీయకుంటే.. కచ్చితంగా వోక్స్ బ్యాటింగ్ చేసేవాడు. భుజం గాయంతో సైతం తన దేశం కోసం మ్యాచ్ ఆడేందుకు బరిలోకి దిగాడు క్రిస్ వోక్స్. అతనికి అందరూ హ్యాట్సాప్ చెబుతున్నారు. 1986లో పైసలాబాద్ టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాడు సలీం మాలిక్ ను గుర్తు చేస్తుంది. ఆ మ్యాచ్‌లో ఎడమచేయి విరిగిపోయినప్పటికి కూడా సలీం బ్యాటింగ్ చేశాడు. 1986లో పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య ఫైసలాబాద్ వేదికగా టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్ పేసర్ మాల్కం మార్షల్ వేసిన బంతి సలీం మాలిక్ ఎడమ చేయిని బలంగా తాకింది. తీవ్రమైన నొప్పితో అతడు విలవిలలాడిపోయాడు. ఆస్పత్రి తీసుకువెళ్లగా అతడి చేయి విరిగిపోయినట్లుగా డాక్టర్లు చెప్పారు. చేతికి కట్టుకుట్టుకుని వచ్చిన సలీం.. పాక్ 9వ వికెట్ పడిన తరువాత క్రీజులోకి వచ్చాడు. తొలుత ఎడమ చేతితో, ఆ తరువాత కుడి చేత్తో బ్యాటింగ్ చేశాడు. వసీం అక్రమ్‌తో కలిసి చివరి వికెట్‌కు 32 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో పాక్ విజయం సాధించింది. కానీ ఇక్కడ వోక్స్ బ్యాటింగ్ చేయలేదు.
టీమిండియా బౌలర్లు అదుర్స్
ఇంగ్లాండ్ బ్యాటర్లలో క్రాలీ 14, బెన్ డకెట్ 54, పోప్ 27, జోరూట్ 105 సెంచరీతో ఆకట్టుకున్నాడు. హ్యారీ బ్రూక్ 111, బెథెల్ 5 పరుగులు చేశారు. ఇవాళ మ్యాచ్ ప్రారంభం కాగానే.. జెమీ స్మిత్ 2, ఓవర్టన్ 9, టంగ్ 0 పరుగులు చేసి ఇవాళ ఔట్ అయ్యారు. చివర్లో అట్కిన్సన్ 17 పరుగులు చేసి గెలిపించేంత పని చేశాడు. కానీ సిరాజ్ వేసిన యార్కర్ కి బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకు ముందు టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 118 పరుగులు చేయగా.. ఆకాశ్ దీప్ 66 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ 53 పరుగులు చేయడం విశేషం.
వాషింగ్టన్ మెరుపు ఇన్నింగ్స్
మరోవైపు చివర్లో వాషింగ్టన్ హాప్ సెంచరీ చేయకుంటే.. టీమిండియా ఆ స్కోర్ చేయకపోయి ఉండేది. జురెల్ 34, కరుణ్ నాయర్ 17, కెప్టెన్ శుబ్ మన్ గిల్ 11, సాయి సుదర్శన్ 11, కేఎల్ రాహుల్ 07 పరుగులు చేశారు. సిరాజ్ డకౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 88 ఓవర్లలో 396 పరుగులు చేయగలిగింది. ఇవాళ సిరాజ్, ప్రసిద్ధ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. బౌలింగ్ లో తొలుత భారత్ మూడు వికెట్లు తీసి మంచి ఊపు కొనసాగించింది. ఆ తరవాత 19 ఓవర్ లో హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్ ను సిరాజ్ అందుకున్నాడు. కానీ మిస్టేక్ లో వెనక్కి అడుగు వేయడంతో ఆ క్యాచ్ కాస్త సిక్స్ గా మారింది. ఇదే అవకాశాన్ని అదునుగా తీసుకొని బ్రూక్ సిక్సులు, ఫోర్లతో 118 పరుగులు చేశాడు.
Chris Woakes ❤️ pic.twitter.com/MRSsC7lVgx
— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) August 4, 2025