Rashmika Mandanna:పాన్ ఇండియా హీరోయిన్ గా అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా వరుస పెట్టి బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. ముఖ్యంగా ప్రతి సినిమా కూడా దాదాపుగా 1000 కోట్ల క్లబ్లో చేరుతున్నాయి అనడంలో సందేహం లేదు. అంతలా తన చిత్రాలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా విడుదలకు ఉంచిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ (The Girl friend). ప్రముఖ నటుడు, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) దర్శకత్వం వహిస్తున్నారు.
నవంబర్ 7వ తేదీన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో దీక్షిత్ శెట్టి హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 25వ తేదీన అంటే ఈరోజు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతలోనే ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో మరొక హీరోయిన్ కూడా నటిస్తోందని తెలుస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే.. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఇందులో అల్లు హీరోయిన్ అను ఇమ్మానుయేల్ (Anu Emmanuel) కూడా భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం అంటూ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ దీక్షిత్ శెట్టితో ఆమె చనువుగా ఉన్న పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. అను ఇమ్మానుయేల్ కూడా ఇందులో మరో హీరోయిన్ గా నటిస్తోందని తెలిసి అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.
ప్రేయసి పాత్రలలో అద్భుతంగా ఒదిగిపోయే టాలెంట్ కలిగి ఉన్న అను ఇమ్మానుయేల్ ఇప్పుడు రష్మిక మందన్నకు పోటీగా ఇదే సినిమాలో నటిస్తోందని మేకర్స్ స్పష్టం చేశారు. మరి ఇద్దరిలో ఎవరు అద్భుతంగా నటిస్తారు ?ఎవరి డామినేషన్ ఎంత ఉంటుంది? అనే సస్పెన్స్ ఇప్పుడు ఆడియన్స్ లో కూడా నెలకొంది అని చెప్పవచ్చు. మొత్తానికైతే అటు అను ఇమ్మాన్యూయేల్ ఇటు రష్మిక మందన్న ఎవరికి వారు తమ నటనతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇద్దరిలో ఎవరికి ఈ సినిమా కలిసి వస్తుందో చూడాలి.
ఇటీవలే ఆయుష్మాన్ ఖురానా తో కలిసి థామా సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈమె.. రెండు వారాలలోపే మరొక సినిమాను విడుదలకు ఉంచింది. అలాగే రెయిన్బో, మైసా వంటి చిత్రాలతో పాటు మరో హిందీ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా రష్మిక మందన్న జోరు అభిమానులను కూడా ఆశ్చర్యపరుస్తోంది అని చెప్పవచ్చు
ALSO READ:Mohan Lal: కేరళ కోర్టులో మోహన్ లాల్ కి ఎదురుదెబ్బ.. లైసెన్స్ రద్దు చేయాలంటూ!