Fauzi Movie : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎప్పుడూ ఆయన చేతిలో అర డజనుకు పైగా సినిమాలో ఉండనే ఉంటాయి.. గత ఏడది కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా పూర్తి చేయలేదు. ఈ ఏడాది వస్తుంది అనుకున్న రాజా సాబ్ మూవీ కూడా వచ్చేయడానికి షిఫ్ట్ అయిపోయింది. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో పౌజి సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి పోస్టర్ని రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి డైరెక్టర్ ఓ షాకింగ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ కూడా రెండు పార్టీలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. రాజా సాబ్ మూవీ కూడా పార్ట్ 2 ఉందని చెప్పేసారు. అలాగే ఫౌజీ కూడా పార్ట్ 2 ఉందని డైరెక్టర్ లీక్ చేశాడు. ఒకవేళ కర్ణుడు, పాండవుల తరుపున యుద్ధం చేస్తే.. మహాభారతం ఎలా ఉండేది? అనే ఆలోచనతోనే ఫౌజీ మూవీ కథను తయారుచేశాను.. ఇందులో ప్రభాస్‌ని చూసి, కచ్ఛితంగా ఆశ్చర్యపోతారు. గతంలో ఎన్నడూ చూడని ప్రభాస్ ను చూడబోతారని అంటున్నాడు. ఈ కథ నిజమైన వలసరాజ్యాల-యుగం సంఘటనల నుండి ప్రేరణ పొందిందని, ఇది విషాదకరంగా ముగిసిందని ఆయన ఓ ఇంటర్వ్యూ అన్నారు. అయితే మరొక వాస్తవంలో అద్భుత కథలు కావచ్చునని ఆయన అన్నారు.. మొత్తానికి ఈ మూవీ పురాణాలతో రాబోతుంది. గతంలో వచ్చిన సినిమాలకు డిఫరెంట్ గా రాబోతుందని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు. మరి ఈ మూవీలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడో చూడాలని ఆయన ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఏది ఏమైనా కూడా ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. స్టోరీని వింటుంటేనే సినిమా బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తుంది.. మరి సినిమా ఎలాంటి టాక్ని అందుకు పోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..
Also Read : బిగ్ బాస్ లోకి వాళ్లు రీ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ బాబోయ్..!
గతంలో డైరెక్టర్ హను రాఘవపూడి సీతారామం మూవీతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న మూవీ పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఆయన ఫౌజీ మూవీ స్టోరీని లీక్ చేసి అంచనాలను పెంచేసాడు. ఫౌజీ’ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే 2026 ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 2026 జనవరిలో ‘ది రాజా సాబ్’ మూవీ రిలీజ్ కాబోతుంది. అదే ఏడాదిలో ఈ మూవీని కూడా రిలీజ్ చెయ్యబోతున్నట్లు సమాచారం.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీలో నటిస్తున్నాడు.. ఆ తర్వాత కల్కి 2, సలార్ 2 సినిమాలలో నటినుంచనున్నాడు.. ఆ తర్వాత హాలీవుడ్ చిత్రాలలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.