Shreyas Iyer Catch: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ మూడో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా టాస్ గెలిచిన కంగారులు మొదట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటికే 8 వికెట్లు నష్టపోయిన ఆస్ట్రేలియా పోరాడుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అద్భుతమైన క్యాచ్ అందుకున్న శ్రేయాస్ అయ్యర్ కు తీవ్రమైన గాయమైంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే అతడు డ్రెస్సింగ్ రూమ్ వెళ్లిపోయాడు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడవ వన్డేలో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. హర్షిత్ రాణా వేసిన ఓ బంతిని ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ కెరీ ( Alex Carey ) గాల్లోకి ఆడేశాడు. దీంతో సిక్స్ వెళ్లాల్సిన బంతి అక్కడే ఎగిరింది. ఈ నేపథ్యంలోనే వెనక్కి పరిగెడుతూ, డైవ్ చేసి మరీ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. క్యాచ్ అందుకున్న శ్రేయాస్ అయ్యర్ కు మాత్రం తీవ్రమైన గాయమైంది. క్యాచ్ పట్టే క్రమంలో కింద పడిపోయాడు శ్రేయాస్ అయ్యర్. కింద పడ్డ శ్రేయాస్ అయ్యర్ నొప్పితో విలవిలలాడిపోయాడు. దీంతో టీం ఇండియా ప్లేయర్లు అందరూ అతన్ని లేపి.. ఫిజీషియన్ ను పిలిచారు. అనంతరం మైదానాన్ని శ్రేయాస్ అయ్యర్ వీడాడు. దీంతో టీమ్ ఇండియా అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. శ్రేయాస్ అయ్యర్ గాయం తీవ్రమైతే, అతడు బ్యాటింగ్ చేయడం కష్టమే అంటున్నారు. శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ చేయకపోతే టీమిండియాకు కష్టాలు తప్పవు.
మొదటి రెండు వన్డేల్లో అద్భుతంగా ఆట తీరు కనబరిచిన ఆస్ట్రేలియా, మూడవ వన్డే వచ్చేసరికి తడబడుతోంది. ఈ మ్యాచ్ లో మొదటి నుంచి ఆస్ట్రేలియా కాస్త ఒత్తిడిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 44 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా, 8 వికెట్లు నష్టపోయి 223 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ఒక్కడే 41 పరుగులు చేయగా, మిడిల్ ఆర్డర్ లో వచ్చిన రెన్షా 56 పరుగులతో రాణించాడు. ఇక మిగిలిన ఆటగాళ్లందరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఈ తరుణంలోనే ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇది ఆట తీరు కనబరిస్తే మూడవ వన్డేలో ఇండియా గెలవడం గ్యారెంటీ అంటున్నారు. ఇది ఇలా ఉండగా టాస్ విషయంలో టీమిండియా చెత్త రికార్డు నమోదు చేసుకుంది. వరుసగా 18సార్లు టీమిండియా వన్డేలలో టాస్ ఓడిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో మూడు మ్యాచ్ లలో కూడా శుభమాన్ గిల్ టాస్ ఓడిపోయాడు.
An unbelievable catch by Shreyas Iyer😱💪
He got injured but refused to let go of the ball, sheer determination on display 🔥👏
📸: Jiohotstar#AUSvIND pic.twitter.com/FDxUBN6VfF
— CricTracker (@Cricketracker) October 25, 2025
Sensational catch from shreyas Iyer , i mean what a catch running back and then diving .
This is the type of fielding you expect from a world class fielder .
Take a bow 🙇 Shreyas Iyer #INDvsAUS #AUSvIND pic.twitter.com/2vegEDAzVE— Stumper (@TheStumpStory) October 25, 2025