Dhruv Vikram:కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ (Vikram chiyan) వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పటికే రెండు చిత్రాలలో నటించిన ఈయన.. తొలిసారి సోలో హీరోగా నటించిన చిత్రం బైసన్. అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran) హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం అందుకుంటుంది. అటు తమిళ్లో విడుదలైన వారం తర్వాత తెలుగులో రిలీజ్ చేసి ఇక్కడ కూడా ప్రేక్షకులను మెప్పించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలకు ముందు సినిమా బృందం మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ధ్రువ్ విక్రమ్ తొలిసారి తెలుగులో మాట్లాడారు. అంతేకాదు తన తండ్రి గురించి, తన గురించి తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచారు.
విషయంలోకి వెళ్తే.. తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ధృవ్ తొలిసారి తెలుగులో మాట్లాడి తన అద్భుతమైన స్పీచ్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇకపోతే ధృవ్ తెలుగులో మాట్లాడిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ స్పీచ్ వెనుక ఉన్నది ఎవరు? అని నెటిజన్స్ ఆరా తీయగా.. ఈ స్క్రిప్ట్ రాసింది ఒక డైరెక్టర్ అని సమాచారం. ఆయన ఎవరో కాదు నాని (Nani) హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ శౌర్యువ్ (Shouryuv). ఈయన ‘ఆదిత్య వర్మ’ సినిమాకి కో డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఇకపోతే శౌర్యువ్ రాసిచ్చిన స్క్రిప్టును చాలా అద్భుతంగా తెలుగులో మాట్లాడి తన స్పీచ్ తో అదరగొట్టేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు ధృవ్ విక్రమ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ:Rana daggubati: తండ్రి కాబోతున్న దగ్గుబాటి రానా!