Rana daggubati:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్న రానా దగ్గుబాటి (Rana daggubati) ఎట్టకేలకు తండ్రి కాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ విషయం తెలిసి దగ్గుబాటి అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతేకాదు అఫీషియల్ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు కూడా. నిజానికి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ..గత కొన్ని నెలలుగా రానా భార్య మిహిక బజాజ్ తల్లి కాబోతోంది అంటూ ఎప్పటికప్పుడు రూమర్స్ క్రియేట్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలు దావానంలా పాకి పోతున్న వేళ.. మిహికా కూడా ఒకసారి స్పందించి శుభవార్త ఉంటే మేమే చెబుతాం అంటూ ఆమె క్లారిటీ కూడా ఇచ్చింది అయినా రూమర్స్ ఆగలేదని చెప్పాలి. అయితే ఇప్పుడు మరొకసారి మిహికా తల్లి అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ దీనిపై మిహిక బజాజ్ లేదా రానా ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప రూమర్స్ కి చెక్ పడదు అని చెప్పవచ్చు.
ALSO READ:Prashanth Neel:దొంగ నా మొగుడు.. అంతమాట అన్నారేంటి మేడమ్!