Prashanth Neel:చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకులు రాజమౌళి (Rajamouli) తర్వాత దాదాపు అదే రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న దర్శకులలో ప్రశాంత్ నీళ్ (Prashanth Neel)కూడా ఒకరు. ఈయన ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారే అయినా కన్నడలో తన మొదటి సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమాతో కన్నడ సినీ పరిశ్రమ రూపురేఖలను మార్చేశారు అని చెప్పవచ్చు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు. తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) తో సలార్ సినిమా చేసి మరో విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం ఎన్టీఆర్ (NTR) తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా ప్రశాంత్ నీళ్ భార్య చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. విషయంలోకి వెళ్తే.. తాజాగా ప్రశాంత్ నీళ్ భార్య లిఖితారెడ్డి (Likhita Reddy) తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో 2 ఫోటోలు షేర్ చేసింది. అదేదో ఫంక్షన్ నుండి ఫోటోలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలలో లిఖిత రెడ్డి పక్కన తన భర్త , డైరెక్టర్ ప్రశాంత్ ఫుల్ వైట్ అండ్ వైట్ షర్టు పంచె కట్టలో కనిపించారు. ఇక ఈ ఫోటోలను ఆమె షేర్ చేస్తూ “దొంగ మొగుడు మొత్తానికి వైట్ అండ్ వైట్లో ఉన్నారు” అంటూ వైట్ కలర్ లవ్ సింబల్ ని ఆమె జోడించారు. మొత్తానికైతే ప్రశాంత్ నీళ్ చేత వైట్ అండ్ వైట్ ధరించేలా చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఇది చూసిన నెటిజన్స్ “ఏంటి.. మేడం అంత మాట అన్నారు” అంటూ కామెంట్లు చేయగా.. మరి కొంతమంది ఇన్నాళ్లకు ప్రశాంత్ నీళ్ ను వైట్ అండ్ వైట్లో చూపించి మంచి పని చేశారు అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ALSO READ:Rashmika Mandanna: రష్మిక కొత్త మూవీలో అల్లు హీరోయిన్.. డామినేషన్ ఎవరిది?
వాస్తవానికి ఇన్ వైట్.. అని ప్రత్యేకంగా ఎందుకు మెన్షన్ చేసింది అనే కోణంలో నెటిజన్స్ ఆరా తీయగా.. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రశాంత్ కి డార్క్ బ్లైండ్నెస్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆయన సినిమాలు దాదాపు బ్లాక్ కలర్ లోనే ఉంటాయి. ఇక ఆయన ధరించే దుస్తులు కూడా దాదాపుగా బ్లాక్ లోనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. పైగా ఆయన అనౌన్స్మెంట్ పోస్టర్లు కూడా బ్లాక్ కలర్ లోనే ఉంటాయి. అందుకే ఈసారి కలర్ మార్చేసి ఇలా పోస్ట్ పెట్టడంతో ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకొంతమంది కలర్ మార్చేసి సెటైర్ వేసింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా తొలిసారి ఇలా వైట్ అండ్ వైట్ లో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు ప్రశాంత్ నీల్.