Priya prakash Varrier: ఒక్క సినిమాతో పాపులర్ అయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఒకే ఒక్క చిన్న బిట్టుతో కుర్రాళ్ళ క్రష్ గా మారిపోయిన హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.. ఈమె పేరు వినగానే అందరికీ కన్ను గీటిన వీడియో కళ్ళ ముందు కనిపిస్తుంది. రాత్రికి రాత్రే సెన్సేషనల్ గా మారిపోయింది.. ఆ తరువాత అడపాదడపా సినిమాల్లో కనిపించిన ఆశించినంత స్టార్ డమ్ ఇంకా రాలేదు. ప్రస్తుతం సినిమాల కన్నా కూడా కమర్షియల్ యాడ్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ హాట్ లుక్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారుకి నిద్ర లేకుండా చేస్తుంది.. ఈమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ వీడియోని చూసిన నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..
ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ ఈమధ్య పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈమెకు సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇటీవల రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన డ్యూడ్ మూవీలోని ఊరం బ్లడ్ అనే కవర్ పాటను చాలా క్యాజువల్ గా పాడి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియోని తన ఇంస్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. వీడియో వైరల్ అవడంతో ఈమె టాలెంటు బయటపడింది. ఇది చూసిన ఆమె అభిమానులు ఆమె వీడియోను షేర్ చేస్తూ లైకులు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు..
Also Read:‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ భాగ్యం జీవితంలో అన్నీ కష్టాలే.. గుండె తరుక్కుపోతుంది..!
ఈ అమ్మడు ఒరు ఆధార్ లవ్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమాలో ఆమె నటన కన్నా కన్ను గీటిన సీన్ మాత్రం కుర్రకారు మతి పోగొట్టేసింది. ఈ మూవీ తర్వాత ఆమె ఓ పోలీస్ కేసును కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కొందరు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆ కేసు వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ బ్యూటీ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి పాపులర్ అయింది. చెక్, ఇష్క్, బ్రో వంటి తెలుగు చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం కన్నడతో పాటు రెండు హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.. మరోవైపు తెలుగులో కూడా సినిమాలను చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అల్లు అర్జున్ అంటే తనకు ఎంతో ఇష్టమైన ఈ అమ్మడు. ఆయన సినిమాలో నటించాలన్న కోరికను బయట పెట్టింది. మరి ఈ అమ్మడు కోరిక నెరవేరుతుందేమో చూడాలి… సోషల్ మీడియాలో ఈమె ఎప్పుడు హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
?igsh=c3JjNzdoNnNheGp6