BigTV English
Advertisement

Khaithi 2: కార్తీ- లోకీ సినిమా ముహూర్తం ఫిక్స్.. సెట్స్ మీదకు అప్పుడేనా..?

Khaithi 2: కార్తీ- లోకీ సినిమా ముహూర్తం ఫిక్స్.. సెట్స్ మీదకు అప్పుడేనా..?

Khaithi 2: తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు. రీసెంట్గా రజనీకాంత్ కూలి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రికార్డులను సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత కార్తీతో సినిమా చేయబోతున్నట్లు గతంలో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కార్తి హీరోగా లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో రూపొందుతున్న సినిమా ‘ఖైదీ 2’. 2019లో విడుదలైన ‘ఖైదీ’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వల్ గా ఖైదీ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా ఈ మూవీ ఆగిపోయింది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. త్వరలోనే షూటింగ్ అప్డేట్ రానున్నట్లు ఇండస్ట్రీలో టాక్..


“ఖైదీ 2” షూటింగ్ షురూ..

కార్తీ – లోకేష్ కనకరాజు కాంబోలో మరో మూవీ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీతోనే ఆయనకు స్టార్ డైరెక్టర్ గుర్తింపు వచ్చింది. వరుసగా కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ వంటి హిట్స్ అందుకున్నారు.. అయితే కూలీ తర్వాత ఈ ఖైదీ 2 సెట్స్ మీదకు వెళ్ళబోతుందని అందరు అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. మొత్తానికి ఇవాళ ఈ మూవీకి కొబ్బరికాయ కొట్టినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ పనిచేయబోతున్నారు. వచ్చే నెలలో సినిమా షూటింగ్ని మొదలు పెట్టబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. మరి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని వినికిడి..

Also Read :తాప్సీ సినిమాలకు గుడ్ బై..? ఇంత షాకిచ్చిందేంటి భయ్యా..!


75 రోజుల్లోనే షూటింగ్ పూర్తి.. 

హీరో కార్తీ మొదటి నుంచి విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ బ్లాక్ బాస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఖైదీ మూవీ అతనికి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. ఈ మూవీకి సీక్వల్ గా ఖైదీ 2 రాబోతుందని డైరెక్టర్ ప్రకటించిన తర్వాత కార్తీ ఈ సినిమాను చేసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు గతంలో చాలా సందర్భాల్లో బయటపెట్టాడు.. ఈ మూవీ షూటింగ్ కోసమే వేరే సినిమాలకు కమిట్ అవ్వలేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా నీ కేవలం 75 రోజుల్లోనే పూర్తి చేసి వచ్చే ఏడాదిలో థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది.. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా ఈ సినిమా కూడా అంతకుమించి వసూలను రాబడుతుందని కార్తీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే లోకేష్ కనకరాజు సినిమాలను తెరకెక్కించడంతో పాటుగా హీరోగా కూడా సినిమా చేయబోతున్నట్లు ఓ వార్త ఈమధ్య వినిపిస్తుంది. ఎలాంటి పాత్రలో కనిపించబోతాడు అని కోలీవుడ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఖైదీ 2 తర్వాత విక్రమ్ 2 సినిమాని తెరకెక్కించే ఆలోచనలో లోకీ ఉన్నట్లు టాక్..

Related News

Mass jathara: సెన్సార్ పూర్తి చేసుకున్న మాస్ జాతర.. రన్ టైం లాక్!

Rajini – Kamal : ఈ మల్టీ స్టారర్ మూవీకి మల్టీపుల్ కష్టాలు

Film industry: భర్తలేమో డైరెక్టర్స్.. భార్యలేమో ప్రొడ్యూసర్స్.. ఈ ట్రెండ్ ఏదో బాగుందే?

The Girl friend Trailer: ప్రేమ అనే నరకంలో చిక్కుకున్న రష్మిక.. బయట పడుతుందా?

Fauzi Movie : ‘ఫౌజీ’ స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్.. రెండు పార్టులు..రెండు స్టోరీలు..

Vivek Oberoi: సందీప్ కి పిచ్చి.. ఇలాంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదు – వివేక్ ఒబెరాయ్!

Dhruv Vikram: స్పీచ్‌తో అదరగొట్టేసిన ధ్రువ్.. ఈ స్క్రిప్టు రాసింది ఓ డైరెక్టర్.. ఎవరో తెలుసా?

Big Stories

×