Vivek Oberoi: సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. చేసింది మూడు సినిమాలే అయినా సంచలనం సృష్టించారు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్న ఆయన.. ఆ తర్వాత ‘కబీర్ సింగ్’ అంటూ ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి మరో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.. అలాంటి ఈయన ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) తో ‘స్పిరిట్’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాపై అందరి చూపు పడిందనే చెప్పాలి. ఇలాంటి సమయంలో తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) సందీప్ రెడ్డి వంగ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సందీప్ రెడ్డి వంగకి పిచ్చి.. ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు అంటూ వివేక్ ఒబెరాయ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి వివేక్ ఒబెరాయ్ ఏ ఉద్దేశంతో అలాంటి కామెంట్స్ చేశారు అనే విషయం ఇప్పుడు చూద్దాం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వివేక్ ఒబెరాయ్ సందీప్ రెడ్డి వంగా గురించి మాట్లాడుతూ.. “సందీప్ ఒక మ్యాడ్ పర్సన్.. ముఖ్యంగా అతడికి సినిమా అంటే ఇష్టం కాదు పిచ్చి. అసలు అంత నాలెడ్జ్, అంత క్లారిటీ ఆయనకు ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.
నాకు ఒక అలవాటు ఉంది.. ఎవరి సినిమా అయినా సరే నచ్చినా లేదా ఎవరి పని అయినా నచ్చినా.. వెంటనే వాళ్లకి ఫోన్ చేసి వారితో మాట్లాడుతాను. అలా ఒకసారి నేను హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు సందీప్ రెడ్డికి కాల్ చేసి తన వర్క్ గురించి మాట్లాడాను. అప్పుడు సందీప్ సార్ మీరంటే నాకు చాలా ఇష్టం.. ఒకసారి మిమ్మల్ని కలవచ్చా అని అడిగాడు. ఆరోజు ఇద్దరం కలిసి కాఫీ కూడా తాగాము. అయితే ఆ సమయంలో కొంత సేపు నేను సందీప్ తో మాట్లాడాను. ఆ కొన్ని గంటల చర్చలో అప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే.. సందీప్ రెడ్డివంగా మామూలు వ్యక్తి కాదు అని.. ముఖ్యంగా అసలు సినిమా పై అతనికి ఉన్నది ఇష్టం కాదు పిచ్చి.. ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు అనిపించింది ” అంటూ వివేక్ ఒబెరాయ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం వివేక్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇప్పటికే బాలీవుడ్ హీరోగా, నటుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న వివేక్ ఒబేరాయ్ ఇప్పుడు సందీప్ రెడ్డివంగా దర్శకత్వం వహిస్తున్న స్పిరిట్ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా స్పిరిట్ కూడా ఊహించని లెవెల్ లో ఉంటుందని.. కచ్చితంగా మరో బ్లాక్ బాస్టర్ హిట్ గ్యారెంటీ అంటూ ఈ సినిమాపై కూడా అంచనాల పెంచేశారు వివేక్.
ALSO READ: Dhruv Vikram: స్పీచ్‌తో అదరగొట్టేసిన ధ్రువ్.. ఈ స్క్రిప్టు రాసింది ఓ డైరెక్టర్.. ఎవరో తెలుసా?