Taapsee Pannu : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు తాప్సీ పన్ను.. మంచు మనోజ్ నటించిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ మూవీ టాక్ ఎలా ఉన్నా సరే ఆమె నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించింది. అందులో కొన్ని భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో హీరోయిన్గా సక్సెస్ అయింది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. తెలుగు తో పాటు పలు భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది.. అందుతున్న సమాచారం ప్రకారం ఇది నిజమే అనే టాక్ కూడా వినిపిస్తుంది. మరి తాప్సీ నిజంగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసిందా..? లేదా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
టాలీవుడ్ హీరోయిన్ తాప్సి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది అంటూ ఓ వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. అందులో నిజం ఎంత ఉందన్నది కరెక్ట్ గా తెలియదు కానీ ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. సౌత్ సినిమాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి. దాంతో ఈమె బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. కెరియర్ పీక్స్ లో పరిగెడుతున్న సందర్భంలోనే తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. క్రీడాకారుడైన మాథియాస్ బోని పెళ్లాడేసిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొంది. డెన్మార్క్ వెళ్లిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే సినిమాలకు గుడ్ బై చెప్పేసారని బయట టాక్.. నిజమేనా అని అడగ్గా.. తాప్సీ తాను ముంబైలోనే ఉన్నట్లు చెప్పుకొచ్చింది. మరి సినిమాలకు గుడ్ బై చెప్తుందా అన్న ప్రశ్నపై మాత్రం సమాధానం చెప్పినట్టు కనిపించలేదు. దాంతో నెటిజన్లు పిల్లలను కనే ఆలోచనలో ఉందేమో అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. మరి దీనిపై ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..
Also Read: బిగ్ బాస్ లోకి వాళ్లు రీ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ బాబోయ్..!
తెలుగులోని స్టార్ హీరోల సరసన నటించిన తాప్సీ.. కొన్ని సినిమాలు ఆమె కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అవ్వగా.. మరికొన్ని సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తుంది. చివరిగా ముదస్సర్ అజీజ్ తెరకెక్కించిన `ఖేల్ ఖేల్ మెయిన్`లో అక్షయ్ కుమార్, వాణి కపూర్, ప్రగ్యా జైస్వాల్ తదితరులతో కలిసి నటించింది. గాంధారి మూవీ లో నటిస్తుంది. వీటితోపాటుగా ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తుంది. మరో రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తుంది. త్వరలోనే వీటి గురించి అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం..