E-Paper
Advertisement

Spy thriller series OTT: ప్రియుడి మర్డర్ కేసులో మెంటలెక్కించే ట్విస్టులు… రివేంజ్ అంటే ఏమిటో చూపించే ప్రియురాలు

Spy thriller series OTT: ప్రియుడి మర్డర్ కేసులో మెంటలెక్కించే ట్విస్టులు… రివేంజ్ అంటే ఏమిటో చూపించే ప్రియురాలు
Advertisement

Spy thriller series OTT : స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది జేమ్స్ బాండ్ సినిమాలు. ఈ సినిమాలుకు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే ఈ సినిమాలను తలపించే ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రిస్మస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సిరీస్ ఫుల్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లండన్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఊహించని మలుపులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ప్రియుడి మర్డర్ కి రివేంజ్ తీర్చుకునే సీన్స్ ఆకట్టుకుంటాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

ఈ బ్రిటీష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘బ్లాక్ డోవ్స్’ (Black Doves). జో బార్టన్ రూపొందించిన ఈ సిరీస్ కీరా నైట్లీ, బెన్ విషా మరియు సారా లంకాషైర్ ప్రధాన పాత్రల్లో నటించారు. మొదటి సీజన్ 2024 డిసెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో విడుదలైంది. ఇందులో మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. మొదటి సీజన్ విజయవంతం కావడంతో, నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే రెండవ సీజన్‌ను ఖరారు చేసింది. దీని షూటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతోంది. ఈ సిరీస్ విమర్శకుల నుండి ప్రశంసలు పొందింది. అంతేకాకుండా నైట్లీ తన నటనకు గాను ఉత్తమ నటిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు కూడా నామినేట్ చేయబడింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హెలెన్ వెబ్ (కీరా నైట్లీ) లండన్‌లో ఒక పవర్‌ఫుల్ పాలిటీషియన్ భార్యగా అందరికీ కనిపిస్తుంది. కానీ నిజానికి ఆమె ‘బ్లాక్ డోవ్స్’ అనే సీక్రెట్ ఏజెన్సీ కోసం పనిచేసే గూఢచారి. పదేళ్లుగా తన భర్తకు సంబంధించిన రహస్యాలను తన సంస్థకు చేరవేస్తుంటుంది. అయితే ఆమె రహస్యంగా ప్రేమించిన వ్యక్తి హత్యకు గురవడంతో హెలెన్ జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. ఆ హత్య వెనుక ఉన్న నిజాలను తెలుసుకోవాలని ఆమె ప్రయత్నిస్తుంటే, ఆమె ప్రాణాలకే ముప్పు వస్తుంది.

ఈ క్రమంలో హెలెన్‌ను కాపాడటానికి ఆమె పాత స్నేహితుడు సామ్ యంగ్ (బెన్ విషా) సీన్ లోకి వస్తాడు. సామ్ ఒక ప్రొఫెషనల్ కిల్లర్, పైగా అతనికి కూడా గతం లో కొన్ని సెటిల్మెంట్స్ ఉంటాయి. వీళ్ళిద్దరూ కలిసి లండన్ అండర్ వరల్డ్ లో జరిగే కుట్రలను ఎలా ఛేదించారు ? హెలెన్ ప్రియుడిని చంపిందెవరు ? హెలెన్ రివేంజ్ ఎలా తీర్చుకుంది ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : మాఫియాను ముప్పతిప్పలు పెట్టే లాయర్… ఐయండిబిలో 8.4 రేటింగ్…వ్యూస్ లో కూడా టాప్

Tags

Related News

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×