Heart Attack: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది గుండె పోటు వల్ల మరణిస్తున్నారు. 2022లో దాదాపు 20 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే ఈ మరణాలలో ఎక్కువ భాగం గుండె పోటు, పక్షవాతం కారణంగా సంభవిస్తున్నాయి. ఒక్క అమెరికాలోనే ప్రతి ఏడాది లక్షలాది మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు. అక్కడి ప్రజల మరణాలకు గల ప్రధాన కారణాల్లో గుండెపోటు ఒకటి. ఈ గణాంకాలు తీవ్రమైన గుండె సమస్యలు ఎంత సాధారణంగా మారాయి.. తక్షణం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒంటరిగా ఉన్నప్పుడు హార్ట్ ఎటాక్ వస్తే ఏం చేయాలి ?
గుండె పోటు లక్షణాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ప్రాణాలతో బయటపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
1. అత్యవసర సేవలు:
ఒంటరిగా ఉన్నప్పుడు హార్ట్ ఎటాక్ వస్తే చేయాల్సిన మొదటి పని అత్యవసర సేవలకు కాల్ చేయడం.మీకు గుండెపోటు వచ్చిందని భావిస్తున్నట్లు డిస్పాచర్ కు తెలియజేయడం అవసరం. ఇలాంటి సమయంలో రోగికి తక్కువ సమయంలోనే చికిత్స ప్రారంభం అవుతుంది. రవాణా ఏర్పాట్లు చేస్తూనే ఫోన్ ద్వారా మీకు సలహాలు అందిస్తారు. రెండు చేతులను ఖాళీగా ఉంచుకుని సూచనలు పాటించడానికి వీలుగా కాల్ స్పీకర్ లో పెట్టండి. అంతకు ముందు ఏవైనా మందులు వాడితే సహాయకులకు తెలియజేయండి. వేరే మార్గం లేకపోతే తప్ప మీరు డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్ కి వెళ్లొద్దు. అంబులెన్స్ మీ ప్రాణాలను రక్షించే క్రమంలో సరైన సమయంలో సేవలను అందించడానికి ఉపయోగపడుతుంది
2. ఆస్పిరిన్ తీసుకోండి:
మీనే స్పృహలో ఉండి.. అంతే కాకుండా మీరు ఆస్పిరిన్ తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేకపోతే వాడటం మంచిది. ఆస్పిరిన్ నమలడం వల్ల అది త్వరగా శరీరంలోకి చేరుకుంటుంది. లక్షణాలు కనిపించినప్పుడు ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల గుండె పోటుతో మరణించే ప్రమాదం తగ్గుతుందని ఓ పరిశోధనలో రుజువైంది. ఇటీవల నిర్వహించిన ఒక విశ్లేషణ ప్రకారం ఆస్పిరిన్ త్వరగా తీసుకోవడం వల్ల గుండె పోటు మరణాలలో దాదాపు 25 శాతం తగ్గింది.
Also Read: మానసిక ప్రశాతంత కరువైందా ? ఇలా చేస్తే అంతా సెట్ ..
3. కాళ్లు పైకి ఎత్తండి:
మీ కాళ్లను పైకి పెట్టడం ద్వారా గుండెకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది మూర్చతో పాటు మైకం వంటి వాటిని కూడా రాకుండా చేస్తుంది. ఇది సాధరణంగా సహాయక ప్రథమ చికిత్స అని చెప్పొచ్చు. కాళ్లు పైకి ఎత్తడం గుండె పోటు చికిత్స కాదు. కానీ దగ్గరలో ఎవ్వరూ లేనప్పుడు ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
4. వీలైనంత ప్రశాంతంగా ఉండండి:
భయం, ఆందోళనలు సింపథెటిక్ డ్రైవ్‌ను ప్రేరేపిస్తాయి. అంతే కాకుండా ఇది గుండె వేగాన్ని, అంతే కాకుండా రక్తపోటును పెంచుతుంది. తద్వారా గుండెకు ఆక్సిజన్ సరఫరా ఎక్కువవుతుంది. నెమ్మదిగా శ్వాస తీసుకోవడంతో పాటు కూర్చోవడం, పడుకోవడం వంటివి కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇలా చేయడం వల్ల గుండెపై ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది.