Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకర్గా బుల్లితెరపై ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. జబర్దస్త్ యాంకర్ అనసూయ లైమ్లైట్లోకి వచ్చింది. ఒక టీవీ షోలు చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరిసింది. అలా నటిగానూ అనసూయ సత్తా చాటింది. ముఖ్యంగా రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర ఎంతటి గుర్తింపు పొందిందో చెప్పనవసరం లేదు.
ఇందులో అచ్చమైన పల్లెటూరి మహిళగా అనసూయ.. రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయింది. ఇండస్ట్రీలో ఆమెను రంగమ్మత్త అని కూడా సరదాగా పిలుచుకుంటుంటారు. బుల్లితెరపై జబర్దస్త్ తో పాటు ఎన్నో షోలకు హోస్ట్ చేసిన ఆమె ఇటీవల యాంకరింగ్ కు గుడ్బై చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి ఇక సినిమాలపై ఫోకస్ పెట్టిన ఆమె ఎన్నో చిత్రాల్లో లీడ్ రోల్స్, నెగిటివ్ రోల్స్ చేసి వెండితెరపై మెరిసింది. ఇటీవల పుష్ప 2లో దాక్షయణి రోల్లో కనిపించి సందడి చేసింది.
ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ ఖాళీ సమయాన్ని ఫ్యామిలీకి కెటాయిస్తుంది. తరచూ తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్స్కి వెళుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకుంటూ యాక్టివ్గా ఉంటుంది. ముఖ్యంగా తన ఫోటోషూట్స్ని షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఎప్పుడు కొత్త పోస్టులతో సర్ప్రైజ్ చేసే అనసూయ.. తాజాగా సోషల్ మీడియాలో ఓ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియా చర్చనీయాంశంగా మారింది. ఆమె ఈ నిర్ణయం వెనక కారణమేంటాని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.
తన మేనేజర్ మహేందర్ని తొలగించినట్టు ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. “ఎన్నో ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత మహేందర్ మేనేజర్ నుంచి రిలీవ్ అవుతున్నారు. ఎన్నో ఏళ్ల మా ఈ జర్నీలో ఎంతో నేర్చుకున్నారు. ఇన్నాళ్లుగా మేనేజర్గా తను కెటాయించిన సమయం, కృషి నిబద్ధతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపై నాకు సంబంధించిన అధికారిక సమాచారం కావాలంటే నేరుగా Enquiry.Anasuyabharadwaj@Gmail.com మెయిల్కి మీ ఫోన్ నెంబర్ ని పంపించండి. మా టీంను మిమ్మల్ని సంప్రదిస్తుంది” అయితే అగ్రీమెంట్ ముగియడంతో అతడు రివీల్ అవుతున్నట్టు అనసూయ వెల్లడించింది. అయితే గతంలో మహేందర్ సమంత, వెన్నెల కిషోర్ లకు కూడా మేనేజర్గా ఉన్నాడట. అయితే కొన్ని కారణాల వల్ల ఆయనను తొలగించారు. ఆ తర్వాత అనసూయ మేనేజర్గా చేరిన మహేందర్.. అగ్రీమెంట్ ముగియడంతో అనసూయ నుంచి కూడా రిలీవ్ అయ్యాడు. ప్రస్తుతం అనసూయ తెలుగులో పలు చిత్రాలతో బిజీగా ఉంది. అలాగే తమిళంలోనూ ఆమె ఓ సినిమా చేస్తున్నట్టు సమాచారం.