Akhanda 2 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో అఖండ 2 ఒకటి. ఈ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అవ్వడానికి కారణం కాంబినేషన్. భద్ర సినిమాతో దర్శకుడుగా పరిచయమైన బోయపాటి శ్రీను బాలకృష్ణతో చేసిన సినిమాలు తోనే బాగా ఫేమస్ అయ్యారు. ఏ హీరోతో చేసినా కూడా బోయపాటి శ్రీను బాలకృష్ణ తో సినిమా చేయడం అనేది ప్రత్యేకం. ఇప్పటికే వీరిద్దరూ కలిసి మూడు సినిమాలు చేశారు. ఆ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు. బాలకృష్ణ ను ఎలా చూపిస్తే వర్క్ అవుట్ అవుతుందో బోయపాటి శ్రీనుకి తెలిసినంతగా ఇంకో దర్శకుడికి తెలియదని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.
హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత వీరిద్దరూ అఖండ 2 తో మరోసారి ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ఈపాటికి విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. డిసెంబర్లో ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. ఈ తరుణంలో సినిమాకి సంబంధించి ఒక బ్లాస్టింగ్ రోర్ వీడియోని కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.
ఈ వీడియో చూస్తే బాలకృష్ణ రెండు గెటప్స్ లో కనిపిస్తున్నారు అని అర్థమవుతుంది. అయితే పవర్ఫుల్ డైలాగ్ తో ఈ రోర్ వీడియో కట్ చేశారు. సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో… ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకు తానో నాకే తెలియదు కొడకా, ఊహకు కూడా అందదు అని పవర్ ఫల్ డైలాగ్ తో రోర్ వీడియోను కట్ చేశారు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.
అయితే గతంలో విడుదలైన గ్లిమ్స్ వీడియోలో అగోరి గెటప్ లో బాలకృష్ణ కనిపించారు. త్రిశూలంతో విధ్వంసం అప్పుడు సృష్టిస్తే, ఇప్పుడు డైలాగ్ తో మంచి హై ఇచ్చారు. ఈ వీడియో చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. బాలకృష్ణ కూడా చాలా స్టైలిష్ గా మరియు పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఇలా చూపించడంలో సక్సెస్ అయ్యాడు కాబట్టి వీరి కాంబినేషన్ ఎప్పటికీ కూడా పవర్ ఫుల్ అనిపిస్తుంది.
వీరి కాంబినేషన్ అంటే అంచనాలు ఉండటం కామన్. ఈ సినిమా నుంచి ఏ కంటెంట్ వచ్చినా కూడా అంతే క్యూరియాసిటీతో ఆడియన్స్ ఎదురు చూస్తుంటారు. కానీ ఆడియన్స్ అంచనాలకు మించి హై ఇస్తుంటాడు బోయపాటి. ఇప్పుడు రిలీజ్ అయిన రోర్ వీడియో కూడా అలానే ఉంది. డిసెంబర్ 5వ తారీఖున ఖచ్చితంగా థియేటర్స్ లో శివతాండవం ఖాయం అని అనిపిస్తుంది. బోయపాటి రామ్ పోతినేని హీరోగా చేసిన స్కంద సినిమా ఊహించిన స్థాయి సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అందుకుంటాడు అనే వైబ్స్ మొదలయ్యాయి.
Also Read: The Raja Saab : ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్, బర్త్డే అయిపోయాక ఇంకేముందిలే