BigTV English
Advertisement

Yellamma: హీరో కన్ఫర్మ్ అయినట్లే, మరి మ్యూజిక్ డైరెక్టర్ పరిస్థితి ఏంటి? వేణు కాంప్రమైజ్ అవుతాడా?

Yellamma: హీరో కన్ఫర్మ్ అయినట్లే, మరి మ్యూజిక్ డైరెక్టర్ పరిస్థితి ఏంటి? వేణు కాంప్రమైజ్ అవుతాడా?

Yellamma: ముందుగా కొన్ని సినిమాల్లో కనిపించిన వేణు జబర్దస్త్ అనే షో తో విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు. కేవలం వేణుకు మాత్రమే కాకుండా చాలామందికి జబర్దస్త్ షో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత వాళ్లకి సినిమా అవకాశాలు కూడా విపరీతంగా వచ్చాయి.


ఫిల్మ్ ఇండస్ట్రీకి కొంతమంది పెద్ద పెద్ద కలలు తోనే వస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి ముందైతే ఏదో ఒక పనిలో దూరిపోతారు. ఆ తర్వాత మెల్లగా ఎదిగే ప్రయత్నం చేస్తారు. వేణు కూడా అదే ప్రయాణాన్ని చేసి బలగం సినిమాతో డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇక వేణు ఎల్లమ్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మ్యూజిక్ డైరెక్టర్ పరిస్థితి ఏంటి.?

బలగం సినిమా హిట్ అయిన తర్వాత నాని హీరోగా ఎల్లమ్మ అనే సినిమా ప్లాన్ చేశాడు వేణు. కొన్ని కారణాల వలన ఆ సినిమా ఎందుకు జరగలేదు. నాని కూడా సినిమా నుంచి బయటకు రావలసిన పరిస్థితి వచ్చేసింది. ఆ తర్వాత నితిన్ హీరోగా ఆ సినిమాను ప్లాన్ చేశారు. ఆల్మోస్ట్ దిల్ రాజు కూడా పలు సందర్భంగా చెప్పారు. కానీ తమ్ముడు సినిమా ఊహించిన ఫలితం సాధించలేకపోవడంతో ఎల్లమ్మ కూడా నితిన్ చేతి నుంచి చేజారిపోయింది.


దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. గతంలో దిల్ రాజు మాట్లాడుతూ దేవి శ్రీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేస్తానని కుమారి 21ఎఫ్ ఈవెంట్లో చెప్పారు. దిల్ రాజు ఇప్పుడు ఆ మాట నిజం చేయబోతున్నారు.

స్వతహాగా దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. అయితే ఎల్లమ్మ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అజయ్ అతుల్ అని అనుకున్నాడు వేణు. అయితే ఆల్రెడీ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఎల్లమ్మ సినిమాకు తనే మ్యూజిక్ చేసుకుంటాడా? లేకపోతే వేణు ఇష్టంతో కేవలం నటనకు మాత్రమే పరిమితం అవుతాడా అనేది తేలాల్సి ఉంది.

లాంగ్ గ్యాప్ 

ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది హీరోలు కూడా వెంటనే తమ నిర్ణయాన్ని చెప్పరు. అలానే ప్రొడ్యూసర్ కూడా సినిమాను త్వరగా ముందుకు తీసుకువెళ్లడు. దీనిని బట్టి దర్శకుడు యొక్క టైం విపరీతంగా వేస్ట్ అయిపోతుంది.

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఇద్దరు డైరెక్టర్లు పరిస్థితి అలానే జరిగిపోయింది. రాజావారు రాణి గారు సినిమా రీసెంట్ సక్సెస్ అందుకున్న తర్వాత రవి కిరణ్ కోలా ఇప్పటివరకు తన రెండవ సినిమాకి దర్శకత్వం చేయలేదు. విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న రౌడీ జనార్దన్ సినిమా రీసెంట్ గా స్టార్ట్ అయింది. వేణు దర్శకత్వం వహించిన బలగం సినిమా కూడా రిలీజ్ అయి దాదాపు రెండేళ్లు గడుస్తుంది. ఇప్పటివరకు రెండో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

Also Read: The Raja Saab : ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్, బర్త్డే అయిపోయాక ఇంకేముందిలే

Related News

Ramgopal Varma : స్పిరిట్ అప్డేట్‌పై ఆర్జీవీ క్రేజీ రియాక్షన్.. ఆ బ్యాడ్ హ్యాబిట్ నాకు తెలుసంటూ!

The Raja Saab 2: రాజాసాబ్ కు సీక్వెల్ ..కొత్త డైరెక్టర్లకు కాస్త ఛాన్స్ ఇవ్వండయ్యా!

Shankar – Murugadoss: ఆ ఇద్దరి టాప్ దర్శకులకు కష్టకాలం నడుస్తుంది, కనీసం 2026 కలిసి వస్తుందా?

Akhanda 2 : అఖండ 2 రోర్ వీడియో వచ్చేసింది, బాలయ్య బోయపాటి విధ్వంసం

The Raja Saab : ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్, బర్త్డే అయిపోయాక ఇంకేముందిలే

Anasuya: అనసూయ కీలక ప్రకటన.. తన మేనేజర్‌ తొలగింపు..

Tollywood Actresses: ఉపాసనతో పాటు కవలలకు జన్మనిచ్చిన టాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్లే!

Big Stories

×