Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 Trophy ) ఛాంపియన్ గా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. తొమ్మిదో సారి టైటిల్ గెలిచిన టీమిండియా, మొన్న టైటిల్ మాత్రం తీసుకోకుండానే దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చింది. పాకిస్తాన్ దేశానికి చెందిన మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న నేపథ్యంలో టైటిల్ టీమిండియా తీసుకోలేదు. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో టైటిల్ తీసుకోకుండానే ఇండియాకు వచ్చేసింది సూర్య సేన.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ టైటిల్ టీమిండియా తీసుకోకపోవడం పై పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా క్రికెటర్లు ఉగ్రవాదులు అంటూ పాకిస్తాన్ లోని సింధ్ గవర్నర్ కమ్రాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఆసియా కప్ 2025 ట్రోఫీని అందజేసేందుకు ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ఓపికగా ఎదురు చూశారని, కానీ ఫైనల్ రోజు టీమిండియా ప్లేయర్లే రాలేదని మండిపడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి మొహ్సిన్ నఖ్వీ, వెళ్లిపోయాక ట్రోఫీని తీసుకుందామని టీమిండియా ప్లేయర్లు అనుకున్నట్లు వెల్లడించారు.
కానీ మొహ్సిన్ నఖ్వీ మాత్రం చాలా తెలివికలవాడు.. అందులోనూ మన పాకిస్తానోడు.. వాళ్లను అస్సలు నమ్మలేదు.. అందుకే అక్కడ నుంచి ట్రోఫీని తనతో తీసుకువెళ్లాడు అని కామెంట్స్ చేశారు. టీమిండియా ప్లేయర్లను టెర్రరిస్టుల లాగా నాకు హ్యాండిల్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇస్తామన్నప్పుడు తీసుకోలేదు కానీ… ఇప్పుడు ట్రోఫీ కోసం మొహ్సిన్ నఖ్వీ వెంట పడుతున్నారని మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో మొహ్సిన్ నఖ్వీ పక్కనే ఉండి, పగలబడి నవ్వారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించాల్సి ఉంది. అటు ఆ పాక్ నేత వ్యాఖ్యాలపై ఇండియన్స్ ఫ్యాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. వాడిని ఉరి తీయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
సెప్టెంబర్ మాసంలో జరిగిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో టీమిండియా చాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నమెంట్ కు టీమిండియా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ లోనే వెళ్ళింది. అయితే అద్భుతంగా రాణించిన టీమిండియా తొమ్మిదో సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ జరిగింది. ఫైనల్స్ లో పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా విజయం సాధించి టైటిల్ ఎగరేసుకు వెళ్లింది.
Mohsin Naqvi walked off with the Asia Cup trophy.
A video shows him ignoring Indian officials and leaving the stage. Now he's being honored in Pakistan for it.
The backlash in India was instant.
Is this just bad sportsmanship or something bigger?sportsmanship #indiacricket… pic.twitter.com/ds3dnpP3w3— Yola Cricket | Cricket moments & updates instantly (@Yolacricket) October 24, 2025