BigTV English
Advertisement

The Raja Saab : ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్, బర్త్డే అయిపోయాక ఇంకేముందిలే

The Raja Saab : ది రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్, బర్త్డే అయిపోయాక ఇంకేముందిలే

The Raja Saab : మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ది రాజా సాబ్. చాలా రోజుల తర్వాత ప్రభాస్ నుంచి ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా వస్తుంది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా మీద విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. ఇకపోతే మారుతి గత కొన్ని రోజులుగా ప్రభాస్ తో సినిమా చేస్తే డార్లింగ్, బుజ్జి గాడు టైప్ ఆఫ్ సినిమా చేస్తాను అని చెబుతూనే ఉన్నాడు. ఆ మాదిరిగానే రాజా సాబ్ సినిమా డిజైన్ చేశాడు. మొదటి ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ తరువాత సంక్రాంతి సీజన్ బాగా కలిసి వస్తుంది కాబట్టి అప్పటికీ వాయిదా వేశారు.


మామూలుగా సినిమా రిలీజ్ ముందు ట్రైలర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ మారుతి మాత్రం ఎవరు ఊహించని విధంగా నాలుగు నెలల ముందే సినిమా ట్రైలర్ విడుదల చేశాడు. ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్

ఈ సినిమా ఫస్ట్ సింగిల్ నవంబర్ 5న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సాంగ్ నవంబర్ 5న వస్తుంది అనే ఆనందం ఒకవైపున, ప్రభాస్ బర్తడే కు వస్తుంది అనుకున్న సాంగ్ రిలీజ్ చేయలేదు అనే బాధ ఒక వైపున ఉంది. మొత్తానికి సినిమా నుంచి వచ్చిన పోస్టర్ కొంతమేరకు ఆకట్టుకుంది.


ప్రభాస్ బర్త్డే సందర్భంగా వచ్చిన అన్ని అప్డేట్స్ కంటే కూడా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ సినిమా అప్డేట్ కొంతమేరకు బాగానే సాటిస్ఫై చేసింది. ఎటువంటి హడావిడి లేకుండా కేవలం వాయిస్ ఓవర్ తో క్యాజువల్ ఫాంట్స్ తో సందీప్ రెడ్డి వంగ డిజైన్ చేసిన వీడియో మంచి హైప్ క్రియేట్ చేసింది. గతంలో అనిమల్ సినిమా అప్పుడు కూడా సందీప్ ఇలానే డిజైన్ చేశాడు.

సంక్రాంతి రాజా సాబ్ తో స్టార్ట్ 

సంక్రాంతి సీజన్ లో సినిమాలు తెలుగు ప్రేక్షకులు విపరీతంగా చూస్తారు. అందుకే చాలామంది దర్శక నిర్మాతలు సంక్రాంతి సందర్భంగా తమ సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే 2026 సంక్రాంతి మాత్రం ప్రభాస్ సినిమాతో మొదలుకానుంది. బాక్సాఫీస్ వద్ద ఆ ఎంటర్టైన్మెంట్ వర్క్ అవుట్ అయింది అని అంటే కలెక్షన్ నెక్స్ట్ లెవెల్ లో వస్తాయి.

మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా కూడా ఎంటర్టైన్మెంట్. నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా ఎంటర్టైన్మెంట్ మొత్తానికి ఈ సంక్రాంతి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ గా మారనుంది.

Also Read: Dheekshith Shetty : ఒక సినిమా అవ్వకముందే ఇంకో సినిమాకి అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చారు

Related News

Ramgopal Varma : స్పిరిట్ అప్డేట్‌పై ఆర్జీవీ క్రేజీ రియాక్షన్.. ఆ బ్యాడ్ హ్యాబిట్ నాకు తెలుసంటూ!

The Raja Saab 2: రాజాసాబ్ కు సీక్వెల్ ..కొత్త డైరెక్టర్లకు కాస్త ఛాన్స్ ఇవ్వండయ్యా!

Shankar – Murugadoss: ఆ ఇద్దరి టాప్ దర్శకులకు కష్టకాలం నడుస్తుంది, కనీసం 2026 కలిసి వస్తుందా?

Akhanda 2 : అఖండ 2 రోర్ వీడియో వచ్చేసింది, బాలయ్య బోయపాటి విధ్వంసం

Yellamma: హీరో కన్ఫర్మ్ అయినట్లే, మరి మ్యూజిక్ డైరెక్టర్ పరిస్థితి ఏంటి? వేణు కాంప్రమైజ్ అవుతాడా?

Anasuya: అనసూయ కీలక ప్రకటన.. తన మేనేజర్‌ తొలగింపు..

Tollywood Actresses: ఉపాసనతో పాటు కవలలకు జన్మనిచ్చిన టాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్లే!

Big Stories

×