The Raja Saab 2: ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమా కూడా రెండు భాగాలుగా లేదంటే ఫ్రాంచైజీస్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో సినిమాలు సీక్వెల్ సినిమాలను ప్రకటించాయి. అయితే ప్రభాస్ హీరోగా నటిస్తున్న దాదాపు ప్రతి ఒక్క సినిమా కూడా సీక్వెల్ సినిమాలను ప్రకటించింది.తాజాగా మరో సినిమా కూడా సీక్వెల్ కు సిద్ధమవుతుందని తెలుస్తోంది. ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruthi) దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్ (The Raja Saab). ఈ సినిమా 2026 జనవరి 9వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందు రాబోతోంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ పనులు కూడా దాదాపు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇక తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల చేయడమే కాకుండా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ నవంబర్ 5వ తేదీ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మారుతి ది రాజా సాబ్ సినిమాని కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే సీక్వెల్ సినిమాకు సంబంధించిన స్టోరీలైన్ ప్రభాస్ కు నెరేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక స్టోరీ లైన్ నచ్చడంతో ప్రభాస్ కూడా కథ సిద్ధం చేయమని చెప్పినట్లు సమాచారం. అయితే ఈ సినిమా రావడానికి మరి కాస్త ఆలస్యం అవుతుందని చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు అన్ని షూటింగ్ పూర్తి అయిన తర్వాతనే రాజా సాబ్ సీక్వెల్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా సీక్వెల్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.
ప్రభాస్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్లు..
ఇక ఈ సినిమా కామెడీ హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేశాయి. ఇక ఈ సినిమాలో మనం వింటేజ్ ప్రభాస్ ను చూడబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు సందడి చేయబోతున్నారు. ప్రభాస్ కు జోడిగా నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగం కాబోతున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్ కు తాతయ్య పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని విషయం తెలియడంతో అభిమానులు స్పందిస్తూ కొత్త దర్శకులకు కూడా ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్సులు ఇవ్వండి అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
Also Read: Aadi Reddy: బిగ్ బాస్ రివ్యూలతో లక్షల్లో సంపాదన.. ఆదిరెడ్డి నెల ఆదాయం ఎంతో తెలుసా?