Tollywood actresses: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబంలో మెగా కుటుంబం ఒకటి. తాజాగా మెగా కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) రెండోసారి తండ్రి కాబోతున్నారని విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా మెగా కుటుంబ సభ్యులు వెల్లడించారు అయితే రెండోసారి ఉపాసన (Upasana) కవల పిల్లలకు(Twins) జన్మనివ్వబోతోందనే విషయాన్ని కూడా ఉపాసన తల్లి శోభన వెల్లడించారు. దీంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలా ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కవలలకు జన్మనిచ్చిన సెలబ్రిటీల గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మంచు విష్ణు – విరోనికా
టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు(Manchu Vishnu) విరోనిగా(Veronica) దంపతులు మొదటి సంతానంగా కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు. అనంతరం ఈ జంట మరో అమ్మాయి, అబ్బాయికి కూడా జన్మనిచ్చి నలుగురు పిల్లలకు తల్లిదండ్రుగా మారారు.
రాహుల్ రవీంద్రన్ – చిన్మయి
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా కొనసాగుతున్న వారిలో రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) ఒకరు ఈయన సింగర్ చిన్మయిన (chinmayi)వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ దంపతులకు కవల ఆడపిల్లలు జన్మించారు.
నమిత -వీరేంద్ర చౌదరి
సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన వారిలో నమిత (Namitha)ఒకరు. ఈమె ప్రముఖ వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు కవల మగ పిల్లలు జన్మించారు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత నమిత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
నయనతార – విగ్నేష్ శివన్
సౌత్ ఇండియన్ లేడీ పవర్ స్టార్ నయనతార (Nayanatara)డైరెక్టర్ విగ్నేష్ శివన్ (Vignesh Shivan)ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు కవల మగ పిల్లలు జన్మించారు. అయితే వీరిద్దరూ సరోగసి ద్వారా పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు.
యాంకర్ ఉదయభాను
బుల్లితెరపై యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఉదయభాను(Udayabhanu) వెండి తెరపై కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఉదయభాను తన మొదటి సంతానంలో కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు.
బుల్లితెర నటి కరుణ
బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కరుణ (Karuna ) వెండితెరపై కూడా పలు సినిమాలలో హీరో చెల్లెలు పాత్రలలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలలో నటించి మెప్పించారు. ఇక ఈమెకు మొదటి సంతానంలో అబ్బాయి జన్మించగా రెండో సంతానంలో కవల ఆడపిల్లలు జన్మించారు. ప్రస్తుతం ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారని విషయం తెలియడంతో ఇండస్ట్రీలో కవల పిల్లలకు జన్మనిచ్చిన సెలబ్రిటీల గురించి ఈ వార్త వైరల్ అవుతుంది.
Also Read: Rahul Sipligunj -Harinya: సింగర్ రాహుల్ – హరిణ్య ఇంట మొదలైన పెళ్లి సందడి.. ఫోటోలు వైరల్!