Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి తెలంగాణలో పలుజిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉదయం, మధ్యాహ్నం వేళ ఎండలు దంచికొడుతుండగా.. సాయంత్రం కాగానే వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యం వరి పంట చేతికి వచ్చే సమయానికే వర్షాలు పడుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు.
ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షం..
దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. హైదరాబాద్ మహానగరంలో పలు చోట్ల మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. అక్కడక్కడ పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు
మరి కాసేపట్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 2 గంటల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి – భువనగిరి, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వివరించారు. మూడు గంటల్లో సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు పడతాయని వివరించారు. ఇక హైదరాబాద్ లో ఇవాళ సాయంత్రం నుండి రాత్రి వరకు మరింత చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ALSO READ: Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. పోటీలో 58 మంది అభ్యర్థులు
ఏపీలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
ఇక ఏపీ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతి – నెల్లూరు, దక్షిణ రాయలసీమలో నైరుతి రుతుపవనాల తరహా వాతావరణం ఉండగాజజ విజయవాడ, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో ఈశాన్య రుతుపవనాల తరహా వాతావరణం ఉంది. రాబోయే 6 గంటల్లో రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, వైఎస్‌ఆర్ కడప, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని అన్నారు. అయితే తిరుపతి, నెల్లూరు నగరాల్లో భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని అన్నారు. మరోవైపు, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం తీరప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
ALSO READ: Bigg Boss 9 Telugu Promo : కెప్టెన్సీ టాస్క్‌లో భీకర యుద్ధం.. కళ్లు తిరిగిపడిపోయిన తనూజ