E-Paper
Advertisement

Anaganaga oka raju Pre release: ‘ఆంధ్ర టూ తెలంగాణ’ అనగనగా ఒక రాజు నుంచి మరో సాంగ్ రిలీజ్

Anaganaga oka raju Pre release: ‘ఆంధ్ర టూ తెలంగాణ’ అనగనగా ఒక రాజు నుంచి మరో సాంగ్ రిలీజ్
Advertisement

Anaganaga oka raju Pre release: డైరెక్టర్ మారి దర్శకత్వంలో టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) మీనాక్షి చౌదరి(Meenakshi Chaudary) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా వరంగల్ లో ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా నుంచి మరొక సాంగ్ విడుదల చేశారు.

ఆంధ్ర టూ తెలంగాణ..

ఇప్పటికే ఈ సినిమా నుంచి బెల్లా.. బెల్లా, రాజుగారి పెళ్లి అంటూ పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలకు ఎంతో మంచి ఆదరణ లభించింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరొక పాటను ప్రీ రిలీజ్ వేడుకలో విడుదల చేశారు. ఆంధ్ర టు తెలంగాణ(Andhra To Telangana) అంటూ సాగిపోయే ఈ స్పెషల్ సాంగ్ ను విడుదల చేయడంతో ఈ పాట కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ లిరిక్స్ అందించగా, సింగర్ ధనుంజయ్, సమీరా భరద్వాజ్ ఈ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

చారులతగా మీనాక్షి చౌదరి..

Advertisement

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి. ఈ అప్డేట్స్ చూస్తుంటే మాత్రం నవీన్ పోలిశెట్టి గ్యారెంటీగా హిట్ కొట్టబోతున్నారని తెలుస్తోంది. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోలతో పోటీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నవీన్ పోలిశెట్టి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలు మీనాక్షి చౌదరి చారులత అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇలా మీనాక్షి హీరోయిన్ గా నటించిన నేపథ్యంలో ఈ సినిమా పట్ల మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

Advertisement

గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న మీనాక్షి చౌదరి ఈ ఏడాది అనగనగా ఒక రాజు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ సంక్రాంతి ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి హిట్ ఇవ్వబోతుందో వేచి చూడాలి. ఈ సినిమా మరొక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. నాగ వంశీ నిర్మాతగా ఇటీవల వరుస సినిమాల ద్వారా నిరాశను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ సినిమా పక్క ఎంటర్టైనర్ గా ఉండబోతోంది అంటూ చిత్ర బృందం ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Lokesh Kanagaraj: అల్లు అర్జున్ సినిమాకు లోకేష్ దిమ్మ తిరిగిపోయే రెమ్యూనరేషన్?

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×