Anirudh Ravichandran: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే అందులో టాప్ 5 లో అనిరుద్ రవిచంద్రన్(Anirudh Ravi chandran) పేరు ఉంటుంది. చిన్న వయసులోనే సంగీత దర్శకుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న అనిరుద్ ప్రస్తుతం వరుస తెలుగు తమిళ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే ఈయన సంగీత సారధ్యంలో తెరకెక్కిన కింగ్ డం (King Dom)సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా జూలై 31వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అనిరుద్ లైవ్ పెర్ఫార్మెన్స్..
ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని తిరుపతిలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇకపోతే ఈ సినిమా 31వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో 28వ తేదీ హైదరాబాదులో యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను(Pre Release Event) నిర్వహించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సంగీత దర్శకుడు అనిరుద్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారని సమాచారం. ఇలా అనిరుద్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఉండబోతుందంటే ఇక గ్రౌండ్ మొత్తం హోరెత్తిపోతుందని చెప్పాలి. ఇక ఈయన పాటలకు, సంగీతానికి ఎంతోమంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.
అంచనాలు పెంచిన ట్రైలర్..
ఇదివరకే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా(Coolie) వేడుకను ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించగా ఈ కార్యక్రమంలో అనిరుధ్ కూలీ పవర్ హౌస్ పాటను పాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కింగ్ డం ప్రీ రిలీజ్ వేడుకలో కూడా ఈయన లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఇక ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఈ సినిమా పై విజయ్ దేవరకొండ ఎన్నో అంచనాలను పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, సత్య దేవ్, వెంకటేష్ వీపీ, అయ్యప్ప శర్మ కీలక పాత్రలలో నటించారు.
సామ్రాజ్యం పేరుతో విడుదల..
తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తుంటే మాత్రం అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు అన్న, తమ్ముడి మధ్య అనుబంధాన్ని కూడా ఈ సినిమా చాటి చెబుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా సాయి సౌజన్యతో కలిసి నాగ వంశీ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక హిందీలో కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రమే ఈ సినిమా పరిమితం కాబోతుంది. అదేవిధంగా హిందీలో సామ్రాజ్యం అనే పేరిట ఈ సినిమా విడుదలవుతుంది. ఇటీవల కాలంలో విజయ్ దేవరకొండ వరుస సినిమాలలో నటిస్తున్న పెద్దగా అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోతున్నారు. మరి ఈ సినిమా అయినా తనకు సక్సెస్ అందిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Jyothi Krishna: త్రివిక్రమ్ పేరు అందుకే వేశాం… మొత్తానికి క్లారిటీ ఇచ్చిన జ్యోతి కృష్ణ!