Jyothi krishna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు ప్రాణ స్నేహితుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నారు అంటే అందులో తప్పకుండా త్రివిక్రమ్ ప్రమేయం ఉంటుంది. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu)సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ ప్రమేయం ఉందని తాజాగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ(Jyothi Krishna) వెల్లడించారు. క్రిష్ జాగర్లమూడి అద్భుతమైన కథతో పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చారు. కథ నచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.
సినిమా నుంచి తప్పుకున్న క్రిష్…
ఇక ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభించినప్పటి నుంచి కరోనా రావడం పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలలో బిజీ కావడంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇలా షూటింగ్ ఆలస్యం కారణంగా క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ వీరమల్లు సినిమాని తన చేతులలోకి తీసుకున్నారు. ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా స్పెషల్ థాంక్స్ కార్డులో త్రివిక్రమ్ పేరు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో త్రివిక్రమ్ పేరు వేయడానికి గల కారణం ఏంటి అంటూ పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి.. తాజాగా ఈ విషయం గురించి నిర్మాత జ్యోతి కృష్ణ స్పందించారు.
వీరమల్లు సినిమాలో త్రివిక్రమ్ హస్తం..
ఈ సందర్భంగా జ్యోతి కృష్ణ మాట్లాడుతూ.. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో భాగంగా త్రివిక్రమ్ గారు తనకు ఎంతగానో హెల్ప్ చేశారని తెలియజేశారు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ గారు ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా తనకు ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ చాలా సహాయం చేశారని అందుకు కృతజ్ఞతతో ఆయన పేరును స్పెషల్ థాంక్స్ కార్డులో వేశామని ఈ సందర్భంగా జ్యోతి కృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఇలా ఈ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర ఉండి అన్ని వ్యవహారాలను చూసుకున్నారని జ్యోతి కృష్ణ చెప్పకనే చెప్పేశారు..
త్రివిక్రమ్ సలహాలు తీసుకోవాల్సిందేనా?
పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఏదైనా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే కచ్చితంగా ఆ సినిమా కోసం దర్శక నిర్మాతలు త్రివిక్రమ్ సలహాలను తీసుకుంటారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు విషయంలో కూడా అదే జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి రెండు రోజులు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టాయి అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఎంత మేర కలెక్షన్లను రాబట్టింది? ఏంటీ? అనే విషయాలను మాత్రం చిత్ర బృందం అధికారకంగా ఎక్కడ వెల్లడించలేదు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన మొట్టమొదటి సినిమా కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా విషయంలో ఎంతో ఆసక్తి కనబరిచారు. ఇక పవన్ నటించిన తదుపరి సినిమాలకు కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలుస్తోంది.
Also Read: Shruti Hassan: నా సినీ కెరియర్ లో బాగా నచ్చిన పాత్ర అదే.. ఎంతో స్పెషల్ అంటూ?