Parineeti Chopra: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పరిణితి చోప్రా(Parineeti Chopra) దీపావళి పండుగ సందర్భంగా అభిమానులకు శుభవార్తను తెలియజేశారు. ఈమె ఇటీవల తల్లి కాబోతోందంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జంట పండంటి మగ బిడ్డకు (Baby Boy)జన్మనిచ్చారు. నేడు ఉదయం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఈమె అడ్మిట్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు అనుగుణంగానే కొద్దిసేపటి క్రితం ప్రముఖ రాజకీయ నాయకుడు ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha) తమకు మగ బిడ్డ జన్మించారు అంటూ ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఇలా దీపావళి పండుగకు ఒక రోజు ముందుగానే ఈ జంట ఈ శుభవార్తను తెలియజేయడంతో పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలు అభిమానులు రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాఘవ్ చద్దా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ఫైనల్లీ మాకు బాబు జన్మించాడు. ఇప్పుడు మాకు ఇదివరకు జీవితం ఏమాత్రం గుర్తులేదు మా చేతులు అలాగే మా హృదయాలు నిండుగా ఉన్నాయి. మొదట మేమిద్దరం కలిసాము ఇప్పుడు మా బిడ్డ రాకతో మాకు అన్ని ఉన్నాయి అంటూ రాఘవ్ చద్దా
చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇలా తమకు బాబు జన్మించారనే విషయాన్ని తెలియజేశారు కానీ, తన బాబుకు సంబంధించిన ఫోటోలను మాత్రం షేర్ చేయలేదు. ఇలా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పరిణితి చోప్రా, రాఘవ్ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం సెప్టెంబర్ 24, 2023వ సంవత్సరంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. వీరి వివాహం రాజస్థాన్లోని ఉదయపూర్ లో లీలా ప్యాలెస్ లో ఎంతో ఘనంగా జరిగింది. ఇక వీరి వివాహ మహోత్సవానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు.
ఇక రాఘవ్ చద్దా విషయానికి వస్తే ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ విభిన్నమైన రంగాలలో కొనసాగుతున్నప్పటికీ కాలేజీ సమయంలోనే ప్రేమలో పడిన నేపథ్యంలో కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని తెలియజేస్తూ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక పరిణితి చోప్రా విషయానికి వస్తే..2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పరిణితి ఈ సినిమా ద్వారా ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇలా మొదటి సినిమా మంచి సక్సెస్ కావడంతో అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: Nara Rohit -Siri Lella: హీరో నారా రోహిత్ ఇంట్లో పెళ్లి సందడి.. ఘనంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్!