BigTV English
Advertisement

The Raja Saab: రాజా సాబ్ సెకండ్ ప్రయత్నం.. నష్ట నివారణ చర్యలా?

The Raja Saab: రాజా సాబ్ సెకండ్ ప్రయత్నం.. నష్ట నివారణ చర్యలా?

The Raja Saab: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 100% సక్సెస్ ఉన్న అతి తక్కువ మంది డైరెక్టర్లలో మారుతి ఒకరు. ఈ రోజుల్లో సినిమాతో ఆ రోజుల్లోనే మంచి సక్సెస్ సాధించారు మారుతి. మారుతి సినిమాలు మొదట చాలామంది యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఉండేవి. అయితే యూత్ లో మంచి క్రేజ్ మార్కెట్ వచ్చిన తర్వాత మారుతి తను సినిమాలు తీసే విధానాన్ని కంప్లీట్ గా మార్చేశాడు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కలిసి చూసే సినిమాలను తీయడం మొదలు పెట్టాడు.


భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత మారుతి ను చూసే విధానం కూడా కంప్లీట్ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం తన కెరియర్ లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మారుతి. ప్రభాస్ హీరోగా ది రాజా సాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ జానెర్ లో ఉండబోతుంది. ఒకప్పుడు ప్రభాస్ బుజ్జిగాడు, డార్లింగ్ వంటి సినిమాల్లో ఎంత ఎంటర్టైన్ గా కనిపించే వాళ్ళు ఈ సినిమాల్లో కూడా అలానే కనిపిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది.

రాజా సాబ్ సెకండ్ ప్రయత్నం

రీసెంట్ టైమ్స్ లో ఆడియన్స్ ఎంత తెలుగుగా మారిపోయారో ప్రత్యేకించి తెలియజేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక విఎఫ్ఎక్స్ విషయంలో తేడా వస్తేనే సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేయడం మొదలు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు వంటి సినిమాకి కూడా విపరీతమైన ట్రోలింగ్ నడిచింది.


ఇక తేజ నటించిన మిరాయి సినిమాకు విఎఫ్ఎక్స్ విషయంలో మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇప్పుడు అదే బ్యానర్ ది రాజా సాబ్ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విఎఫ్ఎక్స్ విషయంలో కొంత నెగిటివ్ ట్రోలింగ్ కూడా నడిచింది. ఇప్పుడు మళ్లీ రెండో ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

నష్ట నివారణ చర్యలు?

సినిమా విడుదలకు కొన్ని రోజులు ముందు ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది ఆనవాయితీ. కానీ మారుతి మాత్రం ఏకంగా నెలలు ముందు ట్రైలర్ రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు ఇంకొక ట్రైలర్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈసారి విఎఫ్ఎక్స్ విషయంలో ఎటువంటి కంప్లైంట్స్ కూడా రాకుండా జాగ్రత్త పడతారేమో చూడాలి.

అయితే కేవలం సినిమాలోని కంటెంట్ మాత్రమే కాకుండా ట్రైలర్ కోసం సెపరేట్ గా షూటింగ్ కూడా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ది రాజా సాబ్ సినిమా కోసం మారుతి చేస్తున్న ప్రయత్నాలు చేస్తే ఆశ్చర్యకరంగా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విపరీతమైన సక్సెస్ సాధిస్తే ప్రభాస్ అభిమానులు మారుతిని గుండెల్లో పెట్టుకోవడం ఖాయం. అలానే అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ లు కూడా అప్పుడప్పుడు ఇస్తుంటాడు దర్శకుడు మారుతి.

Also Read: Ustaad Bhagat Singh : ఇంకా షూటింగ్ దశలో ఉస్తాద్ భగత్ సింగ్, రిలీజ్ పరిస్థితి ఏంటి?

Related News

Mari Selvaraj: నేను అలాంటి సినిమాలే తీస్తాను దయచేసి నన్ను వదిలేయండి

Nara Rohit -Siri Lella: ఘనంగా నారా రోహిత్ సిరి లెల్లా హాల్దీ..ఫోటోలు వైరల్!

Nani: దేవకట్ట దర్శకత్వంలో నాని, మరి సుజీత్ సినిమా పరిస్థితి ఏంటి?

Ustaad Bhagat Singh : ఇంకా షూటింగ్ దశలో ఉస్తాద్ భగత్ సింగ్, రిలీజ్ పరిస్థితి ఏంటి?

Mass Jathara: బాహుబలి ఎఫెక్ట్.. వెనక్కి తగ్గిన మాస్ జాతర.. నిజమెంత?

Chiranjeevi: మెగాస్టార్ పేరు వాడితే చర్యలు తప్పవు.. చిరంజీవి కోర్టులో ఊరట!

Rashmika: పెళ్లి చేసుకుంటే చస్తాం.. రష్మికను బెదిరిస్తున్న ఫ్యాన్స్.. క్రష్మీగానే ఉండాలంటూ!

Big Stories

×