Mass Jathara: రవితేజ (Raviteja)హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం మాస్ జాతర(Mass Jathara). సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో 27వ తేదీ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించారు. అలాగే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
ఇలా ఈ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడింది అంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో అక్టోబర్ 30వ తేదీనే ప్రీమియర్లు ప్రసారం చేయనున్నట్లు నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రీమియర్లను అక్టోబర్ 31వ తేదీ ప్రసారం చేయబోతున్నారని సినిమా నవంబర్ 1వ తేదీ విడుదల కాబోతుందనే వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ఈ సినిమా వాయిదా పడింది అంటూ వస్తున్న వార్తలపై ఇప్పటివరకు చిత్ర బృందం అధికారకంగా ఎక్కడ వెల్లడించలేదు. ఇక ఈ సినిమా వాయిదా పడటానికి ప్రధాన కారణం బాహుబలి ది ఎపిక్(Bahubali The Epic) సినిమా అని తెలుస్తోంది.
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలి. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా రీ రిలీజ్ అవుతున్నప్పటికీ ఊహించని స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరగడం, భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోబోతున్న నేపథ్యంలో అదే రోజు విడుదల కాబోతున్న మాస్ జాతర సినిమాని ఒకరోజు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
సూపర్ డూపర్ హిట్టు..
ఇలా ఈ సినిమా వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో రవితేజ అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్రబృందం వెంటనే స్పందించాల్సి ఉంటుంది. ఇక మాస్ జాతర సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో రవితేజకు జోడిగా శ్రీ లీల(Sreeleela) నటించారు. ఈ సినిమాలో రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన సూపర్ డూపర్ హిట్టు సాంగ్ సూపర్ హిట్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
Also Read: Chiranjeevi: మెగాస్టార్ పేరు వాడితే చర్యలు తప్పవు.. చిరంజీవి కోర్టులో ఊరట!