 
					Ustaad Bhagat Singh : ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఒక రీమేక్ సినిమాతో కూడా రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు. అని పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో ప్రూవ్ చేశారు.
ఇప్పటికీ కూడా హరీష్ శంకర్ అనగానే మొదటి గుర్తు వచ్చే సినిమా గబ్బర్ సింగ్. మళ్లీ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు కాబట్టి గబ్బర్ సింగ్ సినిమాను మించి ఉంటుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు. పలు సందర్భాలలో హరీష్ శంకర్ కూడా ఈ మాట చెప్పారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ కొన్ని డేట్స్ వేరే సినిమాలుకు ఇవ్వడంతో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ షూటింగ్ అయిపోయింది అని గతంలో చెప్పారు. అయితే మళ్లీ ఇప్పుడు షూటింగ్ ఏంటి అనుకుంటున్నారా.? పవన్ కళ్యాణ్ లేని కొన్ని సీన్స్ ను ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేస్తున్నారు.
ఈ సినిమాను 2026 మే నెలలో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా కూడా సమ్మర్ లోనే విడుదలైంది. ఈ సమ్మర్ కూడా కలిసి వస్తే పవన్ ఫ్యాన్స్ కి అంతకు మించిన ఆనందం ఇంకొకటి లేదు.
పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సరైన హిట్ సినిమా పడితే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు ఎలా ఉంటాయో అని చెప్పడానికి నిదర్శనం ఓజి సినిమా. ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా ఓజి. ఇక రీసెంట్ గా కూడా నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది.
ఇకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి సినిమాను మించిన హ్యాపీనెస్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇస్తుంది అని చాలామంది నమ్ముతున్నారు. గతంలో హరీష్ శంకర్ కూడా మాట్లాడుతూ గతంలో మనం ఎలా అయితే కొన్ని సీడీలను దాచుకునే వాళ్ళమో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాను జీవితకాలం దాచుకునేలా తెరకెక్కిస్తున్నాను అంటూ చెప్పారు.
Also Read: Baahubali The Epic Trailer : బాహుబలి తిరిగి వచ్చాడు, మైండ్ చెదిరిపోయే ట్రైలర్ కట్