OTT Movie : ఈ వీక్ మలయాళ సినిమా ఫ్యాన్స్‌కి ఓటీటీలో బోలెడు ఫన్ ఉంది. లవ్ స్టోరీలు, ఫన్నీ అడ్వెంచర్స్, క్రైమ్ థ్రిల్లర్స్ అన్నీ కలిపి మీ వీకెండ్‌ని దసరా రంగులు పూయిస్తాయి. మోహన్‌లాల్ లాంటి స్టార్స్ నుంచి, యంగ్ హీరోల వరకు వస్తున్న ఈ సినిమాలు దుమ్ము దులపబోతున్నాయి. మరి ఈ దసరాను ఓటీటీలలో వచ్చే మలయాళం సినిమాలను చూస్తూ ఆనందంగా జరుపుకోండి. ఈ సినిమాల పేర్లు, ఏ ఓటీటీలోకి రాబోతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ రొమాంటిక్ సినిమాకి సత్యన్ అంతిక్కాడ్ దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్‌లాల్, మాళవిక మోహనన్ సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 31 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 6.9/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా JioHotstarలో, సెప్టెంబర్ 26 నుంచి తెలుగు, తమిళం, హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కథలో సందీప్ అనే 40 ఏళ్ల ఒంటరి మనిషి, కొచ్చిలో క్లౌడ్ కిచెన్ నడుపుతుంటాడు. ఒక హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత, అతని హార్ట్ డోనర్ కూతురు హరితతో లవ్ స్టోరీ మొదలవుతుంది. అయితే ఆమె తల్లి కూడా అతన్ని ఇష్టపడటంతో స్టోరీ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఈ ట్రయాంగిల్ లవ్ ఏమవుతుందనేది ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
బిబిన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ అడ్వెంచర్ సినిమాలో నరైన్, బాబు ఆంటనీ, గౌరి గీతా కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
అక్టోబర్ 1 నుంచి Sun NXTలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. 2 గంటల 26 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 7.8/10 రేటింగ్ పొందింది. ఈ కథ జీవన్ అనే ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. తన లవర్ సెరాని దక్కించుకోవడానికి, ఒక ఫ్యామిలీ ట్రెజర్ సీక్రెట్ కోసం, ఒక అడ్వెంచర్ రైడ్ కి వెళ్తాడు. ఈ క్రమంలో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ మలయాళం సినిమాకి రతీష్ శేఖర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2 నుంచి ZEE5లో హిందీ, తమిళం, తెలుగులో మింగ్ కానుంది. ఇందులో అనూప్ మేనన్, లాల్, రేకా హరీంద్రన్, స్వప్నీల్ బాత్రా ప్రధాన పాత్రల్లో నటించారు. IMDb లో ఈ సినిమా 6.2/10 రేటింగ్ పొందింది. ఈ కతా న్యూయార్క్‌లో ఒక అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. ఈ కిడ్నాప్ వెనక పెద్ద కుట్ర ఉంటుంది. ట్విస్ట్‌లు, సస్పెన్స్‌తో కథ ఊపిరి బిగబట్టేలా సాగుతుంది. చివర్లో ఈ కథ ఎమోషనల్ టచ్‌తో ముగుస్తుంది.
ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సినిమా అక్టోబర్ మొదటి 3 నుంచి Lionsgate Playలో స్ట్రీమింగ్ కి రాబోతోంది. దీనికి ఫైజల్ ఫజిలుదీన్ దర్శకత్వం వహించారు. ఇందులో హ్రిదు హారూన్ , ప్రీతి ముఖుందన్ రెడిన్ కింగ్స్లీ, మిదుత్తి, ఆర్జ్యూ, జెయో బేబీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథలో ఆర్యన్, నిధి అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. ఐతే నిధికి తన ఫ్యామిలీ అరేంజ్డ్ మ్యారేజ్ ఫిక్స్ చేస్తుంది. ఆర్యన్ ఆమెను కలవడానికి మధురై వెళ్తాడు, కానీ అక్కడ ఒక క్రైమ్ గ్యాంగ్‌లో చిక్కుకుంటాడు. బై మిస్టేక్ లో ఒక బ్యాగ్ తీసుకోవడం వల్ల డేంజర్‌లో పడతాడు. చివర్లో ఆర్యన్ గ్యాంగ్‌ని ఓడించి, నిధితో కలిసి హ్యాపీగా ఉంటాడు. 2 గంటల 27 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా I MDb లో 8.3/10 రేటింగ్ పొందింది.
Read Also : అమ్మాయిల్లో ఆ పార్ట్స్ కట్… పాడు పని చేసి నగ్నంగా పడేసే సైకో… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్