BigTV English

OTT Movie : ప్రేమ పెళ్ళికి పెద్దలు ఒప్ప్పుకోలేదని… ‘వోల్ఫ్’ ఎంట్రీతో ఊహించని టర్న్ … గిలిగింతలు పెట్టే మలయాళ క్రైమ్ కామెడీ

OTT Movie : ప్రేమ పెళ్ళికి పెద్దలు ఒప్ప్పుకోలేదని… ‘వోల్ఫ్’ ఎంట్రీతో ఊహించని టర్న్ … గిలిగింతలు పెట్టే మలయాళ క్రైమ్ కామెడీ

OTT Movie : ఓటీటీలోకి కొత్త సినిమాల జాతర కొనసాగుతోంది. అన్నిటికీ మించి మలయాళం సినిమాలకు అతుక్కుపోతున్నారు టాలీవుడ్ ఆడియన్స్. ప్రేక్షకులకు తగ్గట్లు సరికొత్త స్టోరీలను ప్రజెంట్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఒక మలయాళ యాక్షన్ కామెడీ సినిమా, ఓటీటీలోకి రేపటి నుంచి రాబోతోంది. ఈ సినిమా ఒక ట్రెజర్ హంట్ లా సాగుతుంది. హీరో తో పాటు, విలన్లు ఒక విలువైన వస్తువును పొందేందుకు పోటీ పడుతుంటారు. ఈ ప్రయాణంలో కథ ఊహించని మలుపులతో ఆడియన్స్ చేత కేక పెట్టిస్తుంది. ఈ మలయాళ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే 

‘సాహసం (Sahasam) 2025 ఆగస్టు 8న థియేటర్లలో విడుదలైన మలయాళ యాక్షన్ కామెడీ చిత్రం. ఇది బిబిన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో నరైన్, బాబు ఆంటనీ, గౌరి జి. కిషన్, రంజాన్ ముహమ్మద్, అజు వర్గీస్, బైజు సంతోష్, అల్తాఫ్ సాలిం ప్రధాన పాత్రల్లో నటించారు. బిబిన్ అశోక్ సంగీతం ఆడియన్స్ ని అలరిస్తోంది. ఈ చిత్రం 146 నిమిషాల రన్‌టైమ్‌తో, IMDbలో 7.8/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2025 అక్టోబర్ 1 నుంచి  SunNXT లో స్ట్రీమింగ్ కానుంది.

కథలోకి వెళ్తే

జీవన్ అనే పోలీస్ ఆఫీసర్ ఒక చిన్న ఊరిలో ఉంటాడు. అతను సెరా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ సెరా తల్లిదండ్రులు ఆమెకి వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. జీవన్ దీన్ని ఆపడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో, ఒక పురాతన సీక్రెట్ గురించి తెలుస్తుంది.  తన తాతల కాలం నాటి విలువైన వస్తువు ఒకటి ఉందని, ఇది సెరాతో పెళ్లి సమస్యను కూడా సాల్వ్ చేయగలదని తెలుసుకుంటాడు. జీవన్ తన ఫ్రెండ్స్ అయిన రంజాన్, బైజు, షబరీష్, అల్తాఫ్ తో కలిసి ఈ వస్తువుని కనుక్కోవడానికి బయలుదేరతాడు. వాళ్ళు ఊరు ఊరు తిరుగుతూ, ఫన్నీ సిట్యువేషన్స్‌లో చిక్కుకుంటారు.


ఈ సమయంలో ఒక స్ట్రేంజర్ కూడా వీళ్ళతో జాయిన్ అవుతాడు. అతను కూడా ఈ పనిలో లింక్ అవుతాడు. అతని వల్ల కథలో చాలా ఫన్ వస్తుంది. జీవన్ ఫ్రెండ్స్ మధ్య జోక్స్, కామెడీ ఫైట్స్, సెరాతో రొమాంటిక్ సీన్స్ తో స్టోరీ సరదాగా నడుస్తుంది. కానీ ఇంతలోనే కొందరు విలన్స్ కూడా వీళ్ళను వెంబడిస్తారు. వీళ్ళు ఆ వస్తువును దొంగిలించాలని చూస్తారు. ఇక్కడి నుంచి ఇది యాక్షన్ సీన్స్‌కి దారితీస్తుంది. చివర్లో జీవన్, అతని ఫ్రెండ్స్ ఈ రహస్యాన్ని కనుక్కుంటారా ? ఇది వాళ్ళ జీవితాలను మార్చేస్తుందా ? సెరా తో జీవన్ పెళ్లి జరుగుతుందా ? అనే విషయాలను, ఈ మలయాళ యాక్షన్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా ఫ్యామిలీతో చూడడానికి చాలా బాగుంటుంది.

Read Also : మొగుడి వల్ల కావట్లేదని… హోటల్ గదిలో మరొక వ్యక్తితో… ఫ్యామిలీతో కలిసి చూడకూడని మూవీ భయ్యా

Related News

OTT Movie : లవ్ స్టోరీ నుంచి క్రైమ్ వరకు… ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న మలయాళ సినిమాలు

OTT Movie : ప్రేయసిని వెతుక్కుంటూ వెళ్తే గ్యాంగ్ స్టర్ తగిలాడు… కిక్కెక్కించే మలయాళ లవ్ స్టోరీ

OTT Movie: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలివే!

Junior movie OTT: సైలెంట్ గా మరో ఓటీటీలోకి వచ్చిన జూనియర్.. ఇక్కడి పరిస్థితేంటో ?

OTT Movie : అప్పు కట్టలేదని కన్నపిల్లల కళ్ళముందే ఘోరంగా… మనసును మెలిపెట్టే ఫీల్ గుడ్ స్టోరీ

OTT Movie : భర్త ఉండగానే భార్యపై అఘాయిత్యం… ఒక్కొక్కడినీ ముక్కలు ముక్కలుగా నరికి… ఈగోను సాటిస్ఫై చేసే రివేంజ్ భయ్యా

OTT Movie : కూతురి ఫోన్లో అలాంటి వీడియోలు… తండ్రి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్ భయ్యా

Big Stories

×