Dimple Hayathi: డింపుల్ హయతి(Dimple Hayathi) తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. బెజవాడకు చెందిన ఈ ముద్దుగుమ్మ సినిమాలపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి అనంతరం హీరోయిన్ గా అవకాశాలను అందుకున్నారు. గల్ఫ్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె అనంతరం పలు సినిమాలలో నటించి ప్రేక్షకులనుపించారు. అయితే డింపుల్ మాత్రం అనుకున్న స్థాయిలో ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.
తాజాగా డింపుల్ హైయతి సినిమాల ద్వారా సక్సెస్ అందుకో లేకపోయిన తరచూ వివాదాల ద్వారా మాత్రం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఈమె ఓ వివాదంలో చిక్కుకున్నారు అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. డింపుల్ ఇంట్లో పని చేయడానికి ఇద్దరు అమ్మాయిలను ఒరిస్సా నుంచి పిలిపించుకొని తన ఇంట్లో తన పెట్ డాగ్ కోసం వారిని నియమించింది. అయితే కొద్దిరోజులు మంచిగానే ఉన్నప్పటికీ తరచూ డింపుల్, ఆమె భర్త వారిని వేదించడం మొదలుపెట్టారంటూ ఒక వీడియో వైరల్ అవుతుంది. తన ఇంట్లో పని చేసే కార్మికులకు సరైన విధంగా తిండి పెట్టకపోవడమే కాకుండా పని చేసినందుకు డబ్బులు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది.
ఇలా జీతం అడిగిన నేపథ్యంలో ఈమె తన భర్తకు చెప్పడంతో ఆయన వీరి పట్ల చాలా అవమానకరంగా మాట్లాడాలని తెలుస్తుంది .మీరు ఎంత? మీ బ్రతుకులు ఎంత? మీరు కనీసం నా చెప్పుల విలువకు కూడా సరితూగరు అంటూ అవమానకరంగా మాట్లాడారని తెలుస్తోంది. ఇక జీతాలు ఇవ్వని విషయం ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండి మా ఆయన లాయర్ అంటూ కార్మికులపై ఇష్టానుసారంగా మాట్లాడిన నేపథ్యంలో ఈ ఇద్దరు అమ్మాయిలు డింపుల్ అపార్ట్మెంట్ ముందు నిరసనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే తన భర్త లాయర్ అంటూ ఈమె మాట్లాడటంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లి కూడా చేసుకుందా?
అసలు డింపుల్ హైయతి పెళ్లి ఎప్పుడు చేసుకుంది? కొంపతీసి ఈమె రహస్యంగా ఎవరికి తెలియకుండా వివాహం చేసుకుందా? ఒకవేళ పెళ్లి చేసుకొని ఉంటే ఆమె భర్త ఎవరు? అనే విషయాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే డింపుల్ హైయతి తన ఇంట్లో కార్మికుల పట్ల ఇలా ఇబ్బందికరంగా వ్యవహరించారా? ఈమె గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే ఈ వార్తలపై డింపుల్ హయతి స్పందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఈ విషయంపై డింపుల్ స్పందించకపోతే ఇది కాస్త మరింత వివాదంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Also Read: Poonam Kaur: బాలయ్య vs చిరంజీవి.. పూనమ్ సంచలన పోస్ట్…అగ్గి రాజేసిందిగా!